ఇళ్ల స్థలాల విషయంలో ఉద్యోగుల భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమైన ఆయన... పోరుగు సేవల ఉద్యోగుల జీతాలు పెంచుతామన్నారు. అర్హతం, అనుభవం ఆధారంగా ఒప్పంద ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకుంటామన్నారు. ఐఆర్ 27 శాతంపై మంత్రిమండలి భేటీలో నిర్ణయం చేస్తామని చెప్పారు. మేనిఫేస్టోలోని అంశాల్లో ఉద్యోగస్థులకు సంబంధించిన అంశాలున్నాయని... ప్రతి విభాగంలో సెక్రటరీ, హెచ్‌వోడీ దగ్గర మేనిఫెస్టో ఉండాలని చెప్పామని గుర్తు చేశారు. మేనిఫెస్టోలోని పనులన్నీ చేసి ఓట్ల అడిగే పరిస్థితి ఉండాలన్నారు.
ఉద్యోగులు కోరినట్లు సీపీఎస్‌ను రద్దు చేస్తాం:జగన్ - ఆంధ్రప్రదేశ్
ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై ఏం చేస్తామనేది మంత్రి మండలిలో చెబుతామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. గతంలో జరిగిన విషయాలను తాను పట్టించుకోనని స్పష్టం చేశారు.