ETV Bharat / state

'అసెంబ్లీలో చంద్రబాబు మాటలకు షాక్​కు గురయ్యా'

శాసనసభలో ఎలా ప్రవర్తించాలనే విషయంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్ హయాంలో అసెంబ్లీలో జరిగిన ఓ విషయాన్ని ఉదాహరణగా వివరించారు.

author img

By

Published : Jul 3, 2019, 1:23 PM IST

జగన్
'అసెంబ్లీలో చంద్రబాబు మాటలకు షాక్​కు గురయ్యా'

అసెంబ్లీలో ప్రతిపక్షాలకు మాట్లాడే సమయాన్ని తమ ప్రభుత్వం కల్పిస్తుందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వారు కూడా మాట్లాడినప్పుడే ప్రజలకు నిజాలు తెలుస్తాయని అన్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. అసెంబ్లీలో ఎలా మాట్లాడాలి అనే విషయంపై వారికి వివరించారు. తన తండ్రి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటనను సభ్యులకు గుర్తు చేశారు. "చంద్రబాబు ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఓ ప్రాజెక్టు విషయంపై తప్పుడు డాక్యుమెంట్​ను తీసుకువచ్చి అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన ఏం చెబుతున్నారని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మా నాన్నకు కూడా ఒకింత అర్థం కాలేదు. తరువాత రోజు దానిపై డేటా మొత్తం సేకరించి చూస్తే చంద్రబాబు అబద్ధాలు చెప్పారని నాన్న తెలుసుకున్నారు. ఇదేంటయ్యా అసత్యాలు చెప్పావని వైఎస్సార్ ప్రశ్నిస్తే... తనకు అబద్ధాలు మామూలే అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. అసెంబ్లీ రికార్డులు సాక్షిగా ఈ మాట అన్నారు. ప్రతిపక్షాలు తప్పులు చెబితేనే ప్రభుత్వం నిజాలు చెబుతుందని చంద్రబాబు అన్నారు" అని జగన్ గుర్తు చేశారు. ఆ మాటలకు తాను కూడా షాక్​కు గురయ్యాయని వివరించారు. "మీరు మాత్రం ఇలా ప్రవర్తించవద్దు" అని తమ పార్టీ నేతలకు సలహా ఇచ్చారు.

Intro:ap_rjy_36_23_naava_prayanam_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం సెంటర్

Body:ఏళ్లు గడుస్తున్నా నేటి కి గోదావరిపై ఎదురీతే

Conclusion:తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ పోలవరం మండలం జి మూలపాలెం గ్రామం వద్ద వృద్ధ గౌతమీ గోదావరిపై నిర్మించ తలపెట్టిన బ్రిడ్జి నిర్మాణం పునాది స్థాయిలోనే ఆగిపోవడంతో సుమారు ఎనిమిది లంక గ్రామాల ప్రజలు తమ స్వస్థలాలకు చేరుకోవడానికి నేటికీ నాటు పడవ లనే ఆశ్రయించ వలసి వస్తుంది పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బ్రిడ్జి పిల్లర్లు గోదావరిలో దిగిపోవడంతో సంబంధిత నిర్మాణ సంస్థ చేతులెత్తేసింది తదనంతర ప్రభుత్వం మరో సంస్థకు నిర్మాణ పనులు అప్పగించగా మొదటి సంస్థకు చెల్లించవలసిన బకాయిలు విషయమై కోర్టును ఆశ్రయించడంతో నూతన సంస్థ పనులు ప్రారంభించలేదు దీంతో భారీ వర్షాలు వరదల సమయంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు గత ఏడాది ఇదే మండలంలోని పశువుల లంక రేవులో నాటు పడవ బోల్తా పడి ఏడుగురు విద్యార్థులు దుర్మరణం చెందిన తరువాత ప్రభుత్వం ప్రతి రేవు లోను పంట్లును ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ఆదేశించిన అది కూడా అమలు చేయడం లేదు నూతన ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం పై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.