ETV Bharat / state

ఇష్టం మనది.. కష్టం నాన్నది - father's day wishes

ఫాదర్స్​డేరోజు... ప్రేమతో నాన్నకు మనమేం ఇవ్వగలం? అసలు ఇవ్వడానికి మన దగ్గర ఏముంది? పిల్లలే సర్వస్వంగా భావించే నాన్నను ప్రేమతో పలకరించడానికి ఒక్క రోజు చాలుతుందా? చాలదు కదూ!  అందుకే..ఆయన మనకు చేసినవన్నీ ఓసారి గుర్తు చేసుకుందామా?

ఇష్టం మనది.. కష్టం నాన్నది
author img

By

Published : Jun 16, 2019, 10:32 AM IST

అమ్మ మనకు ప్రాణం పోస్తే ఆ ప్రాణానికి ఓ రూపమిచ్చి వ్యక్తిగా తీర్చిదిద్దేది నాన్న. ఉద్యోగమని పొద్దున్నే లేచి వెళ్లే నాన్న ఇంటి పట్టున ఉండలేడు.. కడుపునిండా భోజనం చేయడు.. కంటినిండా నిద్ర కూడా పోడు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం.. కుటుంబ సౌఖ్యం కోసం ఇంటా బయటా నిరంతరం పోరాటం చేస్తూ మనకోసం నిరంతరం శ్రమించే వ్యక్తి నాన్న.

ప్రేమకు ప్రతిరూపం..

ప్రతి విజయంలోనూ వెన్నంటే ఉంటూ ఏ కష్టమొచ్చినా నేనున్నానంటూ ఆసరా ఇచ్చే శక్తి నాన్న. తప్పు చేసినా చిరునవ్వుతో మన్నించి సన్మార్గంలో నడిచేందుకు స్ఫూర్తినిచ్చే వ్యక్తి నాన్న ఒక్కడే. నిస్వార్థంగా సేవలందిస్తూ.. పిల్లలకు రెక్కలొచ్చే వరకు బలం అందిస్తున్న తండ్రి... ప్రేమకు ప్రతిరూపం.

భారమెంతున్నా... తోడునిలిచే శక్తి..

పిల్లల కోసం ఎన్ని కష్టాలు పడినా, కుటుంబపోషణ భారమైనా, అది ఎవరికీ చెప్పకుండా అనునిత్యం శ్రమిస్తూ కుటుంబానికి రక్షకుడు అవుతాడు నాన్న. సమాజంలోని మంచి, చెడు, తప్పొప్పులు, విజ్ఞానం, లోకజ్ఞానం అన్నీ విషయాలు వివరించేది ఆయనొక్కరే. జీవితంలో తండ్రి పాత్ర ఎలాంటిదో మనలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది తెలుసుకుని మీ నాన్నలకు ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపండి!

ఇష్టం మనది.. కష్టం నాన్నది

ఇదీ చదవండిః ఇస్మార్ట్​ బ్యూటీ.. అందాల రాశి

Intro:tg_wgl_51_14_patta_pasupasthakosam_congress_darna_ab_c7_HD
G Raju mulugu contributer

యాంకర్ : రైతు గిట్టుబాటు ధర కల్పించి సకాలంలో పట్టా పాస్ బుక్కులను అందజేయాలని కాంగ్రెస్ పార్టీకి సెల్ రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ములుగు శాసన సభ్యురాలు సీతక్క ఆందోళన నిర్వహించారు. రైతు లేనిదే రాజ్యం లేదన్న కేసీఆర్ పాలన రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు

Body:వాయిస్ : ములుగు జిల్లా కేంద్రంలోని రైతులతో కలిసి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. రైతులకు సకాలంలో పట్టా పాసు పుస్తకాలు అందించకపోవడం మూలంగా రైతులు పండించిన పంటను అమ్ముకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ రాష్ట్రం పేరుతో పట్టా పాసు పుస్తకాలు ఇప్పటికీ 95 శాతం పూర్తి చేస్తామని చెబుతున్న ప్రభుత్వం నిరంకుశ పాలనకు రైతుల ఆందోళన అద్దం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 40% పాస్ పుస్తకాలు పంపిణీ పూర్తి చేసి ధరణి వెబ్సైట్ పేరుతో రైతులను ఇబ్బంది గురి చేస్తున్నారని వారు అన్నారు. ఏకకాలంలో రైతుల రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలను కంచి పట్టు పాస్ బుక్కులను రైతులకు అందించినట్లయితే రైతులందరికీ రైతుబంధు పథకం సకాలంలో అందుతుందని, గతంలో కొన్ని సంవత్సరాలుగా పేరుకుపోయిన రైతుల సర్వే నెంబర్లను ను గ్రామ సభలు నిర్వహించి ప్రజా సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో రైతులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని అన్నారు.

Conclusion:బైట్స్ : అవినాష్ రెడ్డి కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు
: ధను సరి అనసూర్య (సీతక్క) ములుగు ఎమ్మెల్యే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.