ETV Bharat / state

తొలిపద్దులో మెరిసిన "నవరత్నాలు" - navaratnas

2019-20 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముందు నుంచీ చెప్పిన విధంగానే హామీల అమలుకు ప్రాధాన్యత ఇచ్చారు. నవరత్నాలకు భారీగా నిధులు కేటాయించారు.

నవరత్నాలు
author img

By

Published : Jul 12, 2019, 2:48 PM IST

Updated : Jul 12, 2019, 6:11 PM IST

  • వైఎస్​ఆర్ రైతు భరోసా

వైకాపా ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశపెట్టిన బడ్జెట్​లో నవరత్నాలకు భారీగా నిధులు కేటాయించారు. వైఎస్​ఆర్ రైతు భరోసాకు అధికంగా రూ.8,750 కోట్లు కేటాయించారు. దీని వల్ల రాష్ట్రంలో 64.06 లక్షల మందికి లబ్ది చేకూరనుందని ఆర్థిక మంత్రి తెలిపారు. కౌలు రైతులను అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం తమదేనని మమంత్రి బుగ్గన అన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 15 నుంచి ఈ మొత్తాన్ని రైతులకు పంచనున్నట్లు తెలిపారు. వైఎస్​ఆర్ వడ్డీలేని రుణాలు పథకానికి బడ్జెట్​లో నామమాత్రంగా రూ.100 కోట్లను ప్రతిపాదించారు. వైఎస్​ఆర్ పంటల భీమా పథకానికి రూ.1,163 కోట్ల బడ్జెట్​ను కేటాయించారు.

తొలిపద్దులో మెరిసిన "నవరత్నాలు"
  • అమ్మఒడి

1వ తరగతి నుంచి 10 వరకు విద్యార్థులకు ఏడాది రూ.15 వేల చొప్పున సాయం అందించే లక్ష్యంగా ప్రకటించిన అమ్మఒడి పథకానికి రూ.6,455 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దాదాపు 43 లక్షల మందికి దీని ద్వారా లబ్ది చేకూరనుందని మంత్రి బుగ్గన వెల్లడించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో విద్యకు సంబంధించిన అన్ని ప్రమాణాలను మెరుగు పరుస్తామని తెలిపారు.

  • ఆరోగ్యశ్రీ

ప్రతి పేద కుటుంబానికి వైద్యం అందేందుకు రూపొందించిన ఆరోగ్యశ్రీ పథకానికి రూ.1,740 కోట్లు కేటాయించారు. వార్షిక ఆదాయం రూ.5 లక్షల కంటే తక్కువగా ఉన్న అన్ని కుటుంబాలకు ఇది వర్తిస్తుందని మంత్రి తెలిపారు. పథకం కింద రాష్ట్రంతోపాటు హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల్లో ఎక్కడైనా చికిత్స తీసుకోవచ్చని స్పష్టం చేశారు.

  • వైఎస్​ఆర్ గృహ నిర్మాణ పథకం

రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల్లో, 25 లక్షల గృహాలను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోందని మంత్రి బుగ్గన తెలిపారు. ఈ కార్యక్రమానికి రూ.8,615 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

  • వైఎస్​ఆర్ పింఛను కానుక

వైఎస్​ఆర్ పింఛను కానుక పథకం కింద వృద్ధులకు 2 వేల నుంచి 3 వేల వరకు పింఛన్​ పెంచుతానని ముఖ్యమంత్రి ఎన్నికల హామీ ఇచ్చారు. దీనికనుగుణంగా ఈ పథకానికి రూ.15,746.58 కోట్ల భారీ మొత్తాన్ని బడ్జెట్​లో కేటాయించారు. దీనివల్ల సుమారు 65 లక్షల మంది పింఛన్​దారులు లబ్ధి పొందనున్నారని మంత్రి పేర్కొన్నారు.

నవరత్నాల అమలులో భాగంగా వైఎస్​ఆర్ ఆసరా పథకానికి సముచిత స్తానం కల్పించారు. ఈ ఏడాది ఏప్రిల్ 11 వరకు రూ. 27,168 కోట్లు బ్యాంకు రుణాలను నాలుగు దశల్లో రీయింబర్స్ చేస్తామని బుగ్గన వివరించారు.

  • జలయజ్ఞం

పోలవరం, వెలుగొండ వంటి ప్రధాన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడానికి, రాష్ట్రంలోని సరస్సులు, చెరువులు పునురుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. దీనిలో భాగంగా 20190-20 సంవత్సరానికి సాగునీటి ప్రాజెక్టులకు రూ.13,139.13 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.

  • మద్యపాన నిషేదం

రాష్ట్రంలో మద్యపాన నిషేదానికి కట్టుబడి ఉన్నామని మంత్రి బుగ్గన తెలిపారు. మొదటి చర్యగా బెల్టు షాపులపై కఠిన వైఖరి అవలంభిస్తున్నామని.. తర్వాత డీలర్ యాజమాన్యంలోని దుకాణాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ విధానం మద్యపాన నిషేదానికి మార్గం సుగమం చేస్తుందని చెప్పారు.

  • యువత.. ఉపాధి కల్పన

గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో లక్ష కొత్త ఉద్యోగాలు.. వార్డు సచివాలయాల ద్వారా 15వేల కొత్త ఉద్యోగాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని మంత్రి బుగ్గన వివరించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోబర్2 నాటికి ప్రారంభిస్తామని తెలిపారు.

  • ఫీజు రీయింబర్స్​మెంట్

తల్లిదండ్రులు, విద్యార్థులపై ఫీజుల భారాన్ని తగ్గించేందుకు "జగనన్న విద్యాదీవెన పథకం" ద్వారా నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్​మెంట్​ను సమకూర్చనున్నట్టు మంత్రి బుగ్గన ప్రకటించారు. హాస్టళ్లు, ప్రయాణం, పుస్తకాలు వంటి ఇతర ఖర్చులకు ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు చొప్పున ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు. దీనికోసం రూ.4,962.3 కోట్ల నిధులు కేటాయించారు. దీనివల్ల 15.5 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు.

Mumbai, July 12 (ANI): Rebel MLAs from Karnataka returned to a luxury hotel last night. They met Karnataka Assembly Speaker KR Ramesh Kumar in Bengaluru on Thursday. They were directed by Supreme Court to meet the Speaker at 6 pm and resubmit their resignations. The legislators were camping here since Saturday evening after resigning and withdrawing support to the 13- month-old JD(S)-Congress government in Karnataka, bringing it on the verge of collapse.
Last Updated : Jul 12, 2019, 6:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.