ETV Bharat / state

రాష్ట్రంలో భారీగా ఐఎఎస్,ఐపీఎస్ అధికారుల బదిలీలు

రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. మొత్తం 44 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన  కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీలలో భాగంగా తొమ్మిది జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమించింది. మరికొందర్ని జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించిగా..కొందరు అధికారులకు స్థానచలనం కల్పించారు.

author img

By

Published : Jun 5, 2019, 8:49 AM IST

ఐఎఎస్,ఐపీఎస్ అధికారుల బదిలీలు

పాలనలో తనదైన ముద్ర వేసేందుకు సీఎం జగన్ అధికారుల బృందాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఎఎస్​లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల హోదా నుంచి జిల్లా కలెక్టర్ల వరకూ ఈ జాబితాలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల కలెక్టర్లను మార్చింది. మరికొందర్ని సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.
ఐఎఎస్​ అధికారుల బదిలీలకు సంబంధించి..సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 44 మంది ఐఎఎస్, ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న జేఎస్వీ ప్రసాద్ ను ఉన్నత విద్యా శాఖకు, నీరబ్ కుమార్ ప్రసాద్ ను పర్యావరణ, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖకు, ఆదిత్యనాధ్ దాస్ ను జలవనరుల శాఖకు బదిలీ చేశారు.వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పూనం మాలకొండయ్యను బదిలీ చేశారు.ఇప్పటి వరకూ బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా పనిచేసిన బి.ఉదయ లక్ష్మిని జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. పంచాయితీరాజ్ విభాగం నుంచి కెఎస్ జవహర్ రెడ్డిని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. వెయిటింగ్ లో ఉన్న రజత్ భార్గవకు పరిశ్రమలు, మౌలిక వనరులు , పెట్టుబడుల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు. అటవీశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న జి.అనంతరామును గృహనిర్మాణ శాఖకు మార్చారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న కె.ప్రవీణ్ కుమార్ ను యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిశాఖ ముఖ్యకార్యదర్శి గా బదిలీ చేశారు. ఏపీ ట్రాన్స్ కో సీఎండీగా శ్రీకాంత్ నాగులాపల్లిని బదిలీ చేశారు. జెన్ కో సీఎండీ విజయానంద్ ను జీఏడీకి రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. ఎక్సైజు శాఖ కమిషనర్ ముకేష్ కుమార్ మీనాను సాంఘిక, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. పౌరసంబంధాల శాఖ కమిషనర్ పనిచేస్తున్న లక్ష్మీ నరసింహంను సీఆర్డీఏ కమిషనర్ గా బదిలీ చేశారు.
ఆర్థికశాఖ కార్యదర్శిగా పని చేస్తున్న పీయూష్ కుమార్ ను వాణిజ్య పన్నుల శాఖ కమిషన్ గా బదిలీ చేశారు. పురపాలక శాఖ కమిషన్ గా పనిచేస్తున్న కన్నబాబును జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు. వెయింటింగ్ లో ఉన్న గిరిజా శంకర్ ను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గా నియమించారు.పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ను వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ గా నియమించారు.ఏపీ టూరిజం అథారిటీ సీఈఓగా ఉన్న కె.విజయను సీఆర్డీఏ అదనపు కమిషనర్ గా బదిలీ చేశారు. సీఆర్డీఏ అదనపు కమిషనర్ షగిలి షన్మోహన్ ను జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా సూచించారు.
9 జిల్లాలకు కొత్త పాలనాధికారులు
గుంటూరు జిల్లా- శామ్యూల్ ఆనంద్ కుమార్
ప్రకాశం జిల్లా- పి. భాస్కర్
విశాఖ- వాడ్రేవు వినయ్ చంద్
తూర్పుగోదావరి జిల్లా- మురళీధర్ రెడ్డి
నెల్లూరు జిల్లా- శేషగిరి బాబు
కర్నూలు జిల్లా- వీరపాండియన్
అనంతపురం-ఎస్. సత్యనారాయణ
నెల్లూరు జిల్లా- రేవు ముత్యాలరాజు
చిత్తూరు జిల్లా- నారాయణ భరత్ గుప్తా
విజిలెన్సు విభాగం డైరెక్టర్ జనరల్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి డి.గౌతమ్ సవాంగ్ ను ఏపీ రహదారి భద్రతా సంస్థ చైర్మన్ గా బదిలీ చేయటంతో పాటు పోలీసు దళాల అధిపతిగానూ పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించింది. డ్రగ్స్ అండ్ కాపీరైట్స్ డీజీగా ఉన్న కాశీరెడ్డి వీఆర్ఎన్ రెడ్డిని విజిలెన్సు డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే పోలీసు డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న కేఆర్ఎం కిషోర్ కుమార్ ను హోంశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు.

Intro:slug:AP_CDP_37_04_SUICIDE_ATTEMPT_AVB_C6
contributor: arif, jmd
( ) కడపజిల్లా జమ్మలమడుగు మండలం గొరిగనూరు గ్రామంలో లో దారుణం చోటుచేసుకుంది .అప్పులు బాధ తాళలేక ఓ రైతు కుటుంబం సామూహికంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది .ఈ ఘటనలో భర్త పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లితో సహా ఇద్దరు పిల్లలు జమ్మలమడుగు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే జమ్మలమడుగు మండలం గొరిగ నూరు గ్రామానికి చెందిన నరసింహులు అనే రైతు తనకున్న ఒక ఎకరా పొలంలో లో పంటలు పండించేవారు. వరుస కరువు కారణంగా సుమారు 4 లక్షల వరకు అప్పు చేశాడు . అప్పు ఎలా చెల్లెంచాలో తెలియక మంగళవారం సాయంత్రం తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. ఆ సమయంలో భార్య కి ఫోన్ చేయడంతో ఆమె కూడా తనతో పాటు ఇద్దరు పిల్లలను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ విషయం నరసింహులు తల్లికి తెలియడంతో స్థానికుల సహాయంతో వారి నలుగురిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. నరసింహులు పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య కృష్ణవేణి మూడేళ్ల చిన్నారి హర్షిత్, ఏడాది వయసున్న హర్షిత ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు
బైట్ రమాదేవి, నరసింహులు తల్లి

Body:AP_CDP_37_04_SUICIDE_ATTEMPT_AVB_C6

Conclusion:AP_CDP_37_04_SUICIDE_ATTEMPT_AVB_C6
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.