రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మహిళల భధ్రతపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లోనూ ఓ మహిళా కానిస్టేబుల్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రకాశం జిల్లా చినగంజాంలో తెదేపా కార్యకర్త ఆత్మహత్య, కృష్ణా జిల్లాలో ఆశా కార్యకర్త ఆత్మహత్యా యత్నంపై తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే చినగంజాంలో మహిళ ఆత్మహత్యకు పొరుగింటి వారితో గొడవలే కారణమని మంత్రి వివరించారు. రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మచిలీపట్నంలో ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వివరించారు.
పొరుగింటి గొడవలే.. ఆమె ఆత్మహత్యకు కారణం: హోంమంత్రి - ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు
మహిళల భద్రతే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.. రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత.
రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. మహిళల భధ్రతపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు. త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే గ్రామ సచివాలయాల్లోనూ ఓ మహిళా కానిస్టేబుల్ ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రకాశం జిల్లా చినగంజాంలో తెదేపా కార్యకర్త ఆత్మహత్య, కృష్ణా జిల్లాలో ఆశా కార్యకర్త ఆత్మహత్యా యత్నంపై తెదేపా ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అయితే చినగంజాంలో మహిళ ఆత్మహత్యకు పొరుగింటి వారితో గొడవలే కారణమని మంత్రి వివరించారు. రాజకీయాలు చేయడం సరికాదన్నారు. మచిలీపట్నంలో ఆశావర్కర్ ఆత్మహత్యాయత్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని.. విచారణ తర్వాత చర్యలు తీసుకుంటామని హోం మంత్రి వివరించారు.
కంట్రిబ్యూటర్:కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖలో లో జిల్లాస్థాయి ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ఎం. వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
Body:ఈ ప్రదర్శనలో 1905 నాటి నుంచి ఇప్పటివరకు భారతీయ తపాలా శాఖ విడుదల చేసిన అన్ని స్టాంపులను ఈ ప్రదర్శనలో ఉంచారు. నాణాలతో రూపొందించిన మహాత్మాగాంధీ రూపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Conclusion:ప్రదర్శనను తిలకించేందుకు నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎన్నో నాటి చరిత్ర కలిగిన స్టాంపులను చూస్తూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు ఈ ప్రదర్శన ఉంటుందని తపాలా శాఖ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా వివిధ వ్యాపార సంస్థలకు చెందిన స్టాంపులను అతిథులు ఆవిష్కరించారు.
బైట్: డా. ఎం. వెంకటేశ్వర్లు,పోస్ట్ మాస్టర్ జనరల్.