ఉదయం ఏడింటికి బెంగళూరు చేరుకోవాల్సిన హంపి ఎక్స్‌ప్రెస్.. మధ్యాహ్నం రెండున్నరకి వచ్చింది. దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ పరీక్ష జరిగింది. ఉత్తర కన్నడ నుంచి బెంగుళూరులో పరీక్ష రాసేందుకు 500 మంది విద్యార్థులు హంపి ఎక్స్ప్రెస్లో బయల్దేరారు. రైలు ఆరు గంటలు ఆలస్యం కారణంగా...సమయానికి విద్యార్థులు హాజరుకాలేదు. ఒంటిగంటన్నరలోపు రానందున అక్కడి అధికారులు విద్యార్థులను పరీక్షా కేంద్రాలకు అనుమతించలేదు. అంతకు ముందు రైలు ఆలస్యంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు...కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రితో పాటు, రైల్వే మంత్రికి సందేశాలు పంపించినా స్పందనలేదు
మరోవైపు ఈ ఘటనపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో కేంద్రంపై విరుచుకుపడ్డారు. పరీక్ష రాయలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్ నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. హంపి ఎక్స్‌ప్రెస్ ఆలస్యం కారణంగా పరీక్షకు సకాలంలో హాజరుకాలేకపోయిన విద్యార్థులకు తిరిగి నీట్ నిర్వహించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ లేఖ రాయనున్నట్లు సౌత్ వెస్ట్రన్ రైల్వే పీఆర్వో తెలిపారు.
అయ్యో 'హంపి' ఎంత పని చేసింది - undefined
వారంతా...నీట్ రాయల్సిన వారు. రైలు ఆలస్యం కారణంగా వారి భవితవ్యం సందిగ్ధంగా మారింది. హంపి ఎక్స్‌ప్రెస్ సుమారు ఆరు గంటలు ఆలస్యంగా రావడం వల్ల విద్యార్థులు సమయానికి పరీక్షకు హాజరుకాలేకపోయారు. వీరంతా ఉత్తర కన్నడకు చెందిన వారే.

TAGGED:
హంపి