ఇంజినీరింగ్ పనుల్ని పునఃసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుుకున్న నిర్ణయం రాజధాని అమరావతి పైనా ప్రభావం చూపనుంది. 2019 ఏప్రిల్ కి ముందు మంజూరు చేసిన ప్రాజెక్టుల్లో ఇప్పటికీ పనులు చేపట్టని వాటిని రద్దు చేయాలని, పనులు ప్రారంభించి అంచనా విలువలో 25 శాతం లోపు ఖర్చు చేసిన పనుల్ని పునసమీక్షించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈనేపథ్యంలో సీఆర్డీఏ అధికారులు....అమరావతిలో జరుగుతున్న వివిధ పనులు, ఆయా పనుల విలువ, ఇంత వరకు ఎంత విలువైన పనులు పూర్తయ్యాయి.? వంటి వివరాలతో కూడిన జాబితా సిద్ధం చేస్తున్నారు. ఆ జాబితాను ప్రభుత్వానికి పంపనున్నారు. అనంతరం ప్రభుత్వం అనుమతి మేరకు ఏ పనులను కొనసాగించాలి? ఏ పనులు ప్రస్తుతానికి నిలిపివేయాలి అన్నది నిర్ణయిస్తామని సీఆర్డీఏ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు రాజధానిలో సుమారు రూ.40 వేల కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. వాటిలో దాదాపు 95 శాతం వరకు పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇంత వరకు మొత్తం అంచనా వ్యయంలో 25 శాతంలోపు మాత్రమే ఖర్చు చేసిన పనులు 50 శాతం వరకు ఉంటాయని సీఆర్డీఏ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
రాజధాని నిర్మాణ పనులపైనా డైలమా !
ఇంజినీరింగ్ పనుల్ని పునఃసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుుకున్న నిర్ణయం రాజధాని అమరావతి పైనా ప్రభావం చూపనుంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు.. సీఆర్డీఏ అధికారులు రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన నివేదిక ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధమైంది. ఏ పనులు కొనసాగాలో ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని సీఆర్డీఏ అధికారులు తెలిపారు.