ETV Bharat / state

నలుగురు రాజ్యసభ ఎంపీలు తెదేపాకు గుడ్ బై! - sujana chowdary

తెలుగుదేశం పార్టీని భాజపాలో విలీనం చేయాలని నలుగురు ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు.

నలుగురు రాజ్యసభ ఎంపీలు తెదేపాకు గుడ్ బై
author img

By

Published : Jun 20, 2019, 4:58 PM IST

Updated : Jun 20, 2019, 5:47 PM IST

తెదేపా ఎంపీలు సీఎం రమేశ్‌, గరికపాటి మోహనరావు, సుజనాచౌదరి, టీజీ వెంకటేశ్‌ ఆ పార్టీ నుంచి వీడిపోతున్నట్లు రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడుకు లేఖ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీనీ భాజపాలో విలీనం చేయాలని లేఖలో పేర్కొన్నారు.

రాజ్యసభ సభ్యులు పార్టీ మారుతున్నారన్న వార్తలపై చంద్రబాబు నాయకులతో చర్చించారు. పార్టీ సీనియర్లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపారు. ప్రత్యేక హోదా, రాష్ట్ర ప్రయోజనాల కోసమే భాజపాతో పోరాడామన్న చంద్రబాబు... పార్టీకి సంక్షోభాలు కొత్త కాదని పేర్కొన్నారు. నేతలు, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్న తెదేపా అధినేత... భాజపా చర్యలను తీవ్రంగా ఖండించారు.

ఇదీ చదవండీ...

'భవిష్యత్ కార్యాచరణ'పై.. తెదేపా నేతల భేటీ!

Intro:AP_TPT_31_20_tdp meeting_avb_c4 కార్యకర్తలంతా కలిసి మెలిసి వైకాపా దాడులను ఎదుర్కోవాలి. తెదేపా అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి .

Body:సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోవడం బాధాకరంగా ఉన్నప్పటికీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు. ఎన్నికలలో పరాజయం కావడంతో హైదరాబాదు కు వెళ్ళిన సుధీర్ ఇవాళ శ్రీకాళహస్తి చేరుకొని కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెదేపా కార్యకర్తలపై వైకాపా దాడులు చేస్తే సహించబోమని వివరించారు. కార్యకర్తలంతా కలిసి మెలిసి దాడులను ఎదుర్కోవాలని సూచించారు. ప్రతిపక్షం లో ఉన్నప్పటికీ ప్రజలకు మెరు గైన సేవలు అందిస్తామని వివరించారు. ఓటమికి గల కారణాలు ను తెలుసుకొని తప్పులు సరిదిద్దికుంటామని తెలిపారు.

Conclusion:తెదేపా కార్యకర్తలతో బొజ్జల సుధీర్ రెడ్డి సమావేశం .ఈటీవీ భారత్ ,శ్రీకాళహస్తి, సి.వెంకటరత్నం,8008574559.
Last Updated : Jun 20, 2019, 5:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.