విజయవాడకు చెందిన వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన అనుమానితుడు కోగంటి సత్యంతో పాటు నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు. తాజాగా విజయవాడకు చెందిన సీఏ విద్యార్థి చండ్రిక ఆనంద్, చిట్టినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ రమేష్, శ్యామ్ వాటర్ ప్లాంట్‌లో పనిచేసే షేక్ అజారుద్దీన్, విజయవాడకు చెందిన మరో ఆటో డ్రైవర్ పత్తిపాటి నరేష్‌లను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కి తరలించారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రాంప్రసాద్ కదలికలను సీఏ విద్యార్థి గమనించి నిందితులకు చేరవేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చూడండి: