ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారో ఆదివారం విడుదలైన వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్ వెల్లడించాయి. తమ సర్వే ప్రకారం తెలుగుదేశానికి 100కు పది సీట్లు అటు ఇటూగా వస్తాయని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలిపారు. ఇక వైకాపాకు 72 స్థానాలకు పది అటు ఇటూగా వస్తాయని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో వైకాపా గట్టి పోటీనిచ్చినందని ... పవన్ సారథ్యంలోని జనసేనతో పాటు ఇతరులు 3 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేశారు. ఇక వివిధ సంస్థలు వెల్లడించిన ఫలితాలు కింది విధంగా ఉన్నాయి. ఇండియా టుడే ప్రకటించిన ఎగ్జిట్స్ పోల్స్ లో తెదేపా 37-40 సీట్లు వస్తాయని అంచనా వేయగా, వైకాపాకు 130-135 సీట్లు వస్తాయని తెలిపింది. జనసేన కేవలం ఒక్క స్థానానికే పరిమితవుతుందని..కాంగ్రెస్, భాజపాలు ఖాతా తెరిచే అవకాశం లేదని అంచనా వేసింది.
అసెంబ్లీ స్థానాలపై ఎగ్జిట్స్ పోల్స్ :
సర్వే సంస్థ | తెదేపా | వైకాపా | జనసేన | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు |
లగడపాటి సర్వే(అసెంబ్లీ | 90-110 | 65-79 | 0 | 0 | 0 | 0-5 |
ఇండియా టుడే (అసెంబ్లీ) | 37-40 | 130-135 | 0-1 | 0 | 0 | 0 |
ఐఎన్‌ఎస్‌ఎస్(అసెంబ్లీ) | 118 | 52 | 5 | 0 | 0 | 0 |
సీపీఎస్ సర్వే(అసెంబ్లీ) | 43-44 | 130-133 | 0-1 | 0 | 0 | 0 |
వీడీపీ అసోసియేట్స్(అసెంబ్లీ) | 56-60 | 111-121 | 0-4 | 0 | 0 |
లోక్‌సభ స్థానాల్లో ఎవరిది పైచేయి..?
సర్వే సంస్థ | తెదేపా | వైకాపా | జనసేన | కాంగ్రెస్ | భాజపా | ఇతరులు |
లగడపాటి సర్వే(లోక్‌సభ) | 13-17 | 8-12 | 0 | 0 | 0 | 0-1 |
ఇండియా టుడే(లోక్‌సభ | 4-6 | 18-20 | 0 | 0-1 | 0-1 | 0 |
న్యూస్ 18 సర్వే | 10-12 | 13-14 | 0 | 0 | 0-1 | 0 |
ఐఎన్‌ఎస్‌ఎస్ | 17 | 7 | 1 | 0 | 0 | |
టుడేస్ చాణక్య | 14-20 | 5-11 | 0 | 0 | 0 | 0 |
సీ-ఓటర్ | 14 | 11 | 0 | 0 | 0 | 0 |
ఎగ్జిట్స్ పోల్స్ పై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ప్రజల నాడి తెలుసుకోవటంలో ఎగ్జిట్స్ పోల్స్ విఫలమయ్యాయని అభిప్రాయపడ్డారు. వాస్తవాలకు విరుద్ధంగా ఫలితాలు ఉన్నాయని, గతంలోనూ తప్పులు ఇచ్చాయని అన్నారు. ఏపీలో తెదేపా ప్రభుత్వం ఏర్పడటంలో ఎలాంటి అనుమానం లేదని స్పష్టం చేశారు.