పోస్టల్ బ్యాలెట్ జారీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మన్‌లు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి పోస్టల్ బ్యాలెట్‌లు ఇవ్వాల్సిందిగా ఉద్యోగులపై ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు స్వేచ్ఛగా ఓటు వేసుకోలేని దుస్థితి నెలకొందని వాపోయారు.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ సంస్థల నామినేటెడ్ అధ్యక్షులు సమీక్షా సమావేశాలు నిర్వహించి ఉద్యోగులను పోస్టల్ బ్యాలెట్ పేరిట ఇబ్బంది పెడుతున్నారని వెల్లడించారు. వారిపై చర్యలు తీసుకోవాలని ద్వివేదికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షమందికిపైగా ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాల్సి ఉందని పోస్టల్‌బ్యాలెట్‌ల వినియోగానికి ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
ఇదీ చదవండి