ETV Bharat / state

జూలై 1నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ - reservation

ఎట్టకేలకు ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీలు ఖరారయ్యాయి. జూలై 1వ తేదీ నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్‌ ఈనెల 24న విడుదల కానుంది.

విద్యార్థులు
author img

By

Published : Jun 18, 2019, 3:16 PM IST

జూలై 1నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్

రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియకు తేదీలు ఖరారయ్యాయి. తెలంగాణలో ఇంటర్ పరీక్షల పునర్ మూల్యాంకణం కారణంగా ఎంసెట్ ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. ఫలితంగా కౌన్సెలింగ్ షెడ్యూల్ సిద్ధం చేయడంలోనూ ఆలస్యం జరిగింది. ఎట్టకేలకు ఎంసెట్ వేశాల కమిటీ సమావేశమై... కౌన్సెలింగ్​కు సంబంధించిన నిర్ణయం తీసుకుంది.

అందుకే వచ్చే నెలకు
ఎంసెట్​ కౌన్సెలింగ్​కు సంబంధించి ఈ నెల 24న నోటిఫికేషన్‌ జారీ కానుంది. జూలై 1 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభించనున్నారు. కళాశాలలు, కోర్సుల ఎంపిక ఆప్షన్ల నమోదుకు జూలై 4 నుంచి 8వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. వచ్చే నెల 10న సీట్ల కేటాయింపు పూర్తి చేయనున్నారు. ఐఐటీ, నిట్​లలో జూలై 9 నాటికి నాలుగో విడత సీట్ల కేటాయింపు పూర్తి కానుంది. ఆ తర్వాత ఏపీ ఎంసెట్‌ సీట్లు కేటాయిస్తే ఐఐటీ, నిట్​లలో సీట్లు రాని వారు... రాష్ట్రంలోని కళాశాలల్లో చేరే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనివల్ల కౌన్సెలింగ్‌ను వచ్చే నెలకు మార్పు చేశారు.
కళాశాలలు కాస్త ఆలస్యంగానే

ఈ ఏడాది ఇంజినీరింగ్‌, ఫార్మసీ సీట్ల కేటాయింపునకు మూడు విడతలుగా కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. జులై 31 నాటికి మొత్తం మూడు విడతలు పూర్తి చేయనున్నారు. గతంలో మొదటి విడత కౌన్సెలింగ్‌ పూర్తికాగానే చాలా కళాశాలలు తరగతులను ప్రారంభించేవి. ఈసారి మూడు విడతలు పూర్తైన తరువాతనే తరగతులు మొదలుపెట్టాలనే నిబంధన విధించనున్నారు.
రెండోవిడతలో రిజర్వేషన్

ఆర్థికంగా బలహీన వర్గాలకు 5శాతం, కాపులకు 5శాతం చొప్పున ఎంసెట్‌లో రిజర్వేషన్‌ అమలు చేయనున్నారు. ఈ మేరకు 10శాతం సీట్లను సూపర్‌ న్యూమరరీ కింద పెంపు చేసి ఈడబ్ల్యూఎస్‌, కాపు రిజర్వేషన్‌కు కేటాయిస్తారు. ఈ రిజర్వేషన్‌లోనూ మహిళలకు 33 శాతం కోటా ఉంటుంది. ఈ రిజర్వేషన్ల అమలుకు మార్గదర్శకాలు ఇంకా జారీ కానందున... రెండో విడత కౌన్సెలింగ్‌లో వీటిని అమలు చేయనున్నారు. మొదటి విడతలో సీట్లు పొందినప్పటికీ రెండో విడతలో రిజర్వేషన్‌ కింద దరఖాస్తు చేసుకోవచ్చు.

Intro:ATP:- ప్రభుత్వం రాయితీపై ఇస్తున్న గొర్రెలను అందివ్వాలని అనంతపురంలో జెడ్పీ కార్యాలయం ఎదుట రైతులు నిరసన తెలిపారు. రాయితీపై గొర్రెల కోసం ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని విధాలుగా ప్రణాళికలు పూర్తిచేసిన రాయితీపై గొర్రెలను ఇవ్వడంలో అధికారుల నిర్లక్ష్యం చాటుతున్నారని రైతులు మండిపడ్డారు. అనంతపురంలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో రైతులు నిరసన చేపట్టారు.

Body:నెలలు గడుస్తున్నా తమ రాయితీల పై అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెల కోసం బ్యాంకుల్లో సైతం తమ పొలాలను సూరిటిగా పెట్టి డీడీలను కూడా తీసి అధికారులకు అందించిన సరిగా స్పందించడం లేదని వాపోయారు. ఇన్నినాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. కలెక్టర్ ఆదేశించిన పశుసంవర్ధక శాఖ జెడి సన్యాసిరావు స్పందించలేదని ఇప్పటికైనా స్పందించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరారు.

బైట్.... ఓబులేష్ యాదవ్, రైతు పామిడి మండలం అనంతపురం జిల్లా

Conclusion:అనంతపురం ఈటీవీ భారత్ రిపోర్టర్ రాజేష్ సెల్ నెంబర్:- 7032975446.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.