రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... ప్రభుత్వంలో చలనం లేదని తెలుగుదేశం ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఆందోళన చేశారు. సభ ప్రారంభంలోనే రైతుల ఆత్మహత్యలు, విత్తనాల కొరతపై వాయిదా తీర్మానం ఇచ్చారు. దీన్ని ఛైర్మన్ షరీఫ్ తిరస్కరించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ...రాష్ట్రంలో 37 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చించకపోతే ఎలాగని తెదేపా సభ్యులు ప్రశ్నించారు. వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు. ఈ అంశంపై వేరే రూపంలో చర్చకు అనుమతిస్తామని ఛైర్మన్ ప్రకటించారు. 20 నిమిషాలకు పైగా సభలో ఆందోళన సాగింది. తర్వాత సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు.
రైతుల ఆత్మహత్యలపై తెదేపా వాయిదా తీర్మానం
రైతుల ఆత్మహత్యలపై శాసన మండలిలో తెదేపా వాయిదా తీర్మానం ఇచ్చింది. ప్రభుత్వంలో చలనం లేదని మండలిలో ఎమ్మెల్సీలు ఆందోళన చేశారు. రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని తెదేపా సభ్యులు పట్టు పట్టారు. వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా... ప్రభుత్వంలో చలనం లేదని తెలుగుదేశం ఎమ్మెల్సీలు శాసనమండలిలో ఆందోళన చేశారు. సభ ప్రారంభంలోనే రైతుల ఆత్మహత్యలు, విత్తనాల కొరతపై వాయిదా తీర్మానం ఇచ్చారు. దీన్ని ఛైర్మన్ షరీఫ్ తిరస్కరించారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ...రాష్ట్రంలో 37 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత ముఖ్యమైన అంశంపై చర్చించకపోతే ఎలాగని తెదేపా సభ్యులు ప్రశ్నించారు. వెల్లోకి వెళ్లి ఆందోళన చేశారు. ఈ అంశంపై వేరే రూపంలో చర్చకు అనుమతిస్తామని ఛైర్మన్ ప్రకటించారు. 20 నిమిషాలకు పైగా సభలో ఆందోళన సాగింది. తర్వాత సభ్యులు తమ సీట్లలో కూర్చున్నారు.
కంట్రిబ్యూటర్ నటరాజు
సెంటర్ అద్దంకి
--------------------------------------------------------------
ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని సాయి మందిరాలు గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి అద్దంకి , సింగరకొండ ,ముప్పవరం, ధర్మవరం లోని సాయి మందిర్ వద్ద వివిధ గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సాయి బాబా విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు . మహిళలు బాబా విగ్రహానికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. సింగరకొండ లోని సాయి మందిరం వద్ద సాయి బాబా విశ్వ రూపం భక్తులను ఆకట్టుకుంది. ఆలయ కార్యనిర్వాహక వర్గం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
Body:.
Conclusion:.