ఇంటర్మీడియట్ పరీక్షలు తప్పాననే మనస్తాపంతో తెదేపా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో ఓ అపార్ట్మెంట్లో నివాసముండే రమేశ్ మేనల్లుడు ధర్మరామ్... అమీర్పేట్ నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. గణిత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. తన తండ్రికి, సోదరికి మెసేజ్ పెట్టి ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తీవ్ర గాయాలపాలైన ధర్మరామ్ను యశోద ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఇవీ చూడండి: మెట్రో రైళ్లు నిలిచిపోవడానికి కాలుష్యమే కారణం