కాఫర్ డ్యామ్ పనులు అసంపూర్తిగా ఉండడంపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం, కాఫర్ డ్యామ్ రక్షణ ఏర్పాట్లను సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద వచ్చే నాటికి పనులు ఎందుకు పూర్తి చెయ్యలేదని, ఒకవేళ ఎక్కువ వరద వస్తే పరిస్థితి ఏంటని అధికారులను ప్రశ్నించారు. కాఫర్ డ్యామ్‌లతో పాటు, నీరు మళ్లితే స్పిల్ వే కట్టడం, ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నిచారు. స్పిల్ వే, పైలట్, స్పిల్ ఛానెల్లో ఇంకా ఎంత కాంక్రీట్ పని మిగిలి ఉందని ఆరా తీశారు. వరద నీటి కారణంగా ఇప్పటి వరకు చేపట్టిన నిర్మాణాలు దెబ్బ తినకుండా రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కాఫర్ డ్యామ్ నదిలో వచ్చే వరదను తట్టుకోగలదా అని జలవనరుల శాఖ అధికారులను అడిగారు.
అధికారులతో సమీక్ష అనంతరం నిర్వాసితులతో సీఎం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా నిర్వాసితులు మెరుగైన పరిహారం ఇవ్వాలని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.