ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ముఖ్యమంత్రి జగన్తో సమావేశమయ్యారు. సమ్మె నోటిసులోని 26 డిమాండ్లు పరిష్కరించేందుకు యాజమాన్యం లిఖిత పూర్వకంగా నిన్న అంగీకారం తెలియజేసింది. ఈ మేరకు ఆర్టీసీ పరిరక్షణకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కార్మిక సంఘాలు కోరాయి. డిజిల్ ధరల పెంపు వలన ప్రభుత్వానికి భారీగా నష్టాలు వస్తున్నాయని వీటిని ప్రభుత్వమే భరించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త బస్సుల కొనుగోలుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలని, ఆర్టీసీ చెల్లిస్తున్న మోటర్ వెహికల్ ట్యాక్స్ రద్దు చేయాలని నేతలు ముఖ్యమంత్రికి విన్నవించారు. డిమాండ్లపై సీఎం సానుకూల స్పందనతో సమ్మె యోచనకు కార్మికులు విరమణ ప్రకటించారు. ఆర్టీసీ సమస్యలు ఇక ప్రభుత్వ బాధ్యత అని ముఖ్యమంత్రి చెప్పినట్లు కార్మిక సంఘాల నేతలు వెల్లడించారు. మీరంతా ప్రభుత్వ ఉద్యోగులని..అన్నారని తెలిపారు.
'ఆర్టీసీ ఉద్యోగులు కాదు... ప్రభుత్వ ఉద్యోగులే' - ముఖ్యమంత్రి జగన్
సమ్మె ఆలోచన విరమించుకున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాలు ప్రకటించాయి. సమ్మె నోటిసు ఇచ్చిన ఆర్టీసీలోని కార్మిక సంఘాలు సీఎం ఛాంబర్లో జగన్ను కలిశాయి. అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అంశంపై కమిటీ వేసినందుకు జగన్‌కు ధన్యవాదాలు తెలిపాయి. నష్టాలపై ప్రస్తావించిన కార్మికులను జగన్ సముదాయించారు.