ETV Bharat / state

ఎస్​ఐ ఫలితాలు విడుదల.. త్వరలో ధ్రువపత్రాల పరిశీలన - results

అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో సీఎం జగన్ ఎస్​ఐ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత తదితరులు పాల్గొన్నారు.

సీఎం జగన్ చేతుల మీదుగా ఎస్​ఐ ఫలితాలు విడుదల
author img

By

Published : Jul 22, 2019, 12:15 PM IST

Updated : Jul 22, 2019, 4:41 PM IST

సీఎం జగన్ చేతుల మీదుగా ఎస్​ఐ ఫలితాలు విడుదల

ముఖ్యమంత్రి జగన్మోహన్​రెడ్డి ఎస్​ఐ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. అమరావతిలోని అసెంబ్లీ ఆవరణలో ఫలితాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీస్ రిక్రూట్​మెంట్ బోర్డు ఛైర్మన్ విశ్వజిత్ పాల్గొన్నారు. పోలీస్ శాఖలో వివిధ ఖాళీల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో 333 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. పోలీస్ శాఖలోని సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్, డిప్యూటీ జైలర్లు, స్టేషన్ ఫైర్ అధికారుల నియామకానికి సుమారు 10 నెలల క్రితం చేపట్టిన భర్తీ ప్రక్రియకు సంబంధించి నిర్వహించిన పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి.

ఈ పోస్టుల భర్తీకై మొత్తం లక్షా 35 వేల 414 మంది ధరఖాస్తు చేసుకోగా.. ప్రిలిమినరీ పరీక్ష, ఫిజికల్ ఫిట్​నెస్​లో 32 వేల 745 మంది అర్హత సాధించారు. అనంతరం వారికి నిర్వహించిన ఫైనల్ పరీక్షలో 333 మంది అభ్యర్ధులు ఎంపికయ్యారు. వారిలో సబ్ ఇన్​స్పెక్టర్ సివిల్ కు 149 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఆర్మ్డ్ రిజర్వు) 75 మంది, రిజర్వు సబ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (ఎపి స్పెషల్ పోలీస్) 75 మంది డిప్యూటీ జైలర్లు(పురుష) 10 మంది, డిప్యూటీ జైలర్(మహిళ) 4, స్టేషన్ ఫైర్ అధికారులు 20 మంది మొత్తం 333 మంది ఎంపికైనట్టు మంత్రి సుచరిత పేర్కొన్నారు. ఈ పరీక్షల్లో పరుచూరి మహేశ్(నెల్లూరు), షేక్ హుస్సేన్ పీరా(కడప), పాలెం రవి కిశోర్(కడప) టాపర్లుగా నిలిచారు. ముగ్గురూ 255 మార్కులు వంతున పొందారని సుచరిత వెల్లడించారు. కృష్ణా జిల్లాకు చెందిన విశ్వనాధపల్లి ప్రజ్ఞ 224 మార్కులతో మహిళల్లో టాపర్ గా నిలిచారని పేర్కొన్నారు.

ఎంపికైన అభ్యర్ధుల ధ్రువపత్రాల పరిశీలన అనంతరం శిక్షణ ఇవ్వనున్నట్లు సుచరిత తెలిపారు. ఎంపికైన అభ్యర్ధులందరికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారని ఆమె పేర్కొన్నారు. కాగా పోలీస్ కానిస్టేబుళ్లు, వార్డర్లు, ఫైర్ మెన్లు, డ్రైవర్ ఆపరేటర్లకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను కూడా త్వరలో విడుదల చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ఆమె తెలిపారు.

పోలీస్శాఖలో ఇంకా 17శాతం వివిధ కేటగిరీల్లో ఖాళీలను భర్తీ చేయాల్సి ఉందని.. వాటి భర్తీకి త్వరలో ప్రత్యేక నియామకాలు చేపట్టనున్నట్టు సుచరిత వెల్లడించారు. పోలీస్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి పోలీస్ సిబ్బందికి వారాంతపు సెలవు ఇవ్వడం వల్ల వారు మరింత సమర్థవంతంగా విధులను నిర్వహించేందుకు అవకాశం కలిగిందని ఆమె పేర్కొన్నారు.

ఇవీ చదవండి..

గృహ నిర్మాణ అక్రమాలపై విజిలెన్స్​ విచారణ'

Intro:ap_knl_21_22_live_operations_ab_AP10058
యాంకర్, ఏవైనా శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తే కొత్త అంశాలపై అవగాహన కల్పించడం పరిపాటి. అయితే ఈ ప్రక్రియలో స్వీయ అనుభవంలో ఎదురైన విషయాలు.. పరిశీలించిన ప్రత్యేక అంశాలను మరింత సులువుగా అర్థమవ్వడానికి పవర్ ప్రోజెక్టర్ తో వివరిస్తారు. ఇవేమి గాకుండా ప్రత్యక్ష ప్రసారంతో శస్త్ర చికిత్సలను శిక్షణ పొందే వారికి వివరించడం ఓ ప్రత్యేకత. కర్నూలు జిల్లా నంద్యాల లో మధుమణి నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో జాతీయ సదస్సు జరిగింది. చెవి, ముక్కు, గొంతు శస్త్ర చికిత్సలు చేసి వైద్యులకు అవగాహన కల్పించారు. సదస్సు ఏర్పాటు సందర్భంగా 100 మందికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేశారు. పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ వైద్యులు, వైద్య నిపుణులు హాజరయ్యారు. శస్త్ర చికిత్సలు చేసే క్రమంలో సందేహాలను నివృత్తి చేశారు.
బైట్, డాక్టర్ మధుసూదన్, సదస్సు నిర్వాహకులు, మధుమణి, నర్సింగ్ హోమ్, నంద్యాల.

Body:ఉచిత శస్త్ర చికిత్సలు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
Last Updated : Jul 22, 2019, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.