ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి అసెంబ్లీకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి... నేరుగా తనకు కేటాయించిన ఛాంబర్‌కు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం... ఛాంబర్లో కూర్చుకున్నారు. సీఎంకు ఉపముఖ్యమంత్రులు ఆళ్లనాని, పాముల పుష్పశ్రీవాణి, మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. శాసనసభ అధికారులు ముఖ్యమంత్రి జగన్‌ను ఛాంబర్‌కు తోడ్కోని వెళ్లారు. బుధవారం ఉదవారం 10గంటల 50నిమిషాలకు అసెంబ్లీకి చేరుకున్న జగన్... పూజ ముగిసిన అనంతరం 11గంటల 05నిమిషాలకు సభలోకి ప్రవేశించారు. శాసనసభలో జాతీయ గీతాలాపన అనంతరం... ప్రోటెం స్పీకర్ శంబంగి చినఅప్పలనాయుడు నోటిఫికేషన్ చదివి... సీఎం జగన్‌తో ప్రమాణం చేయించారు.
ఇదీ చదవండీ...