ETV Bharat / state

జేఈఈ ర్యాంకర్లకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

జేఈఈలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మొదటి 24 మందిలో ఆరుగురు ఏపీ, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం ముదావహమని అభిప్రాయపడ్డారు.

జేఈఈ ర్యాంకర్లకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
author img

By

Published : Apr 30, 2019, 8:57 AM IST

జేఈఈ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ముందంజలో ఉండడం గర్వకారణమన్న చంద్రబాబు... రాష్ట్ర ఖ్యాతి దేశవ్యాప్తంగా ఇనుమడించిందని అభిప్రాయపడ్డారు. తొలి 10ర్యాంకుల్లో 3 ర్యాంకులు దక్కడం సంతోషదాయకమని హర్షం వ్యక్తం చేశారు. మొదటి 24 మందిలో ఆరుగురు ఏపీ, తెలంగాణ విద్యార్థులే కైవసం చేసుకోవడం ముదావహమన్న సీఎం... ఏటా 30 నుంచి 40 శాతం ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలవారే ఉండటం అభినందనీయమన్నారు.

పరీక్షా విధానంలో మార్పులు వచ్చినా... పర్సంటైల్ విధానంలో... డెసిమల్ స్కోర్​లోనూ ముందుండటం తెలుగు విద్యార్ధుల ప్రతిభకు నిదర్శనమని చంద్రబాబు కొనియాడారు. అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్ధులకు, వారి తల్లిదండ్రులకు,ఉపాధ్యాయ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ర్యాంకర్లు వీరే...
నెల్లూరు జిల్లా నర్సాపురానికి చెందిన బట్టేపాటి కార్తికేయ, అనంతపురం పట్టణానికి చెందిన కొండా రేణు, విజయవాడకు చెందిన యెందుకూరి జయంత్ ఫణిసాయి, గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన బొజ్జా చేతన్​రెడ్డి వరుసగా 5,9,19,21 ర్యాంకులు సాధించారు.

ఇదీ చదవండి...

జేఈఈ మెయిన్స్​లో 24 మందికి 100కి వంద​

Intro:విశాఖ సింహాచలం సింహగిరిపై తొలి విడత చందన అరగదీసి

Body:విశాఖ సింహాచలం సింహగిరిపై ఘనంగా స్వామి వారి తొలి విడత చందన అరగదీత ప్రారంభం అయింది మే 7వ తేదీన చందనయాత్ర స్వామి వారి నిజరూప దర్శనం జరుగనుంది దీనిలో భాగంగా స్వామివారికి సమర్పించే మూడు మణుగుల చందనాన్ని నేటి నుండి అరగదీసే కార్యక్రమాన్ని దేవాదాయశాఖ అర్చకులు ప్రారంభించారు తొలి చందనం చెక్కను ఆలయ ప్రధాన అర్చకులు అరగదీసి సారు అనంతరం ఈ కార్యక్రమం ప్రారంభమైంది సింహగిరిపై ఘనంగా చందనయాత్ర కి ఏర్పాట్లు ప్రారంభం చేస్తున్నారు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ ఏడాది సామాన్య భక్తుని దృష్టిలో పెట్టుకొని షామియానాలు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు ఈ చందన అరగదీసే కార్యక్రమాన్ని మూడు రోజులపాటు 125 కేజీలు ఆరగిస్తారు అనంతరం చందనాన్ని భద్రపరిచి చందనయాత్ర అయిన మరుసటి రోజున స్వామికి సమర్పిస్తారు స్వామికి జరిగే ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనది స్వామివారి నిజరూప దర్శనం ఈ చందనోత్సవం ప్రభుత్వం ఈ ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉత్సవంగా చేస్తుంటారు దేశం నలుమూలల నుండి స్వామివారి దర్శనానికి భక్తులు తరలి వస్తుంటారు అందుకు తగ్గ ఏర్పాట్లు దేవాదాయ శాఖ అధికారులు చేస్తున్నారు బైట్ ఆలయ ప్రధాన అర్చకులు గోపాలక్రిష్ణమచార్యులు

Conclusion:9885303299 భాస్కర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.