ఫొని తుపాను బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ప్రజానీకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఫొని తుపాన్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపారు. నాలుగు జిల్లాల రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజలకు ఈదురుగాలులు, భారీవర్షాల వల్ల అపార నష్టం కలిగే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. బాధిత ప్రజానీకానికి ఆపదల్లో అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గతంలో వాటిల్లిన అనేక విపత్తుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకొచ్చి బాధితులను ఆదుకున్నారని గుర్తు చేశారు. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లన్న నినాదంతో... దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తితో అందరూ ముందుకొచ్చి సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. తాగునీరు, పాలు, ఆహారం తదితర నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు.
ఫొని తుపాను బాధితులను ఆదుకోండి: చంద్రబాబు
ఫొని తుపాను బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ప్రజానీకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.