50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు... ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఒక్కో శాసనసభ స్థానం పరిధిలోని 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఒకేసారి అన్ని కౌంటింగ్ టేబుళ్లపై సమాంతరంగా లెక్కిస్తే... 9గంటల సమయం సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఒక్కో వీవీప్యాట్‌లోని స్లిప్పులు లెక్కించేందుకు సగటున 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుందన్నారు.
6 రోజులు అవసరమే లేదు
ఒక్కో శాసనసభ నియోజకవర్గ పరిధిలోని 250 పోలింగ్ కేంద్రాలు ఉంటాయనుకుంటే, అందులో సగం 125 కేంద్రాల్లోని వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలి. ఈవీఎం కంట్రోల్ యూనిట్లను ఒకేసారి 14 టేబుళ్లపై లెక్కించినట్లే... వీవీప్యాట్ రశీదుల్ని లెక్కిస్తే గరిష్ఠంగా 9 రౌండ్లలో లెక్కింపు పూర్తి అవుతుంది. ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలకు పూర్తయితే, ఆ తర్వాత వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించడం మొదలుపెట్టి... రాత్రి 9గంటలకు పూర్తిచేయవచ్చని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విధానం అనుసరిస్తే... సుప్రీంకోర్టుకు ఈసీ చెప్పినట్లు 6రోజుల సమయం అవసరమే ఉండదని తెలిపారు. ఒకవేళ ఈసీ చెబుతున్నట్లు 6 రోజుల సమయం పట్టినా ఇబ్బందేంటని CM ప్రశ్నించారు.
ఈసీకి ఆసక్తి లేదా?
ఏదైనా నియోజకవర్గంలో ఈవీఎంల ఓట్లు, వీవీప్యాట్ స్లిప్పుల్లోని ఓట్ల సంఖ్యకు తేడా వస్తే... ఫలితాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయాలని చంద్రబాబు కోరారు. అలాంటిచోట 100శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాకే ఫలితాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈవీఎం, వీవీప్యాట్ ఓట్ల సంఖ్య తేడా వచ్చిన నియోజకవర్గం వివరాలను ఐదేళ్లపాటు ఈసీ వెబ్‌సైట్‌లో పొందుపరచాలని కోరారు. కనీసం వీవీప్యాట్ పత్రాలను లెక్కింపు ఫలితాలు చూడాలన్న ఆసక్తి కూడా ఈసీకీ లేకపోవడం ఏంటని సీఎం ప్రశ్నించారు.
మిగతా చోట్ల తేడా వస్తే?
దేశంలో ఇప్పటివరకు 15 వందల పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించగా, ఈవీఎంలలోని ఓట్ల సంఖ్యతో ఎక్కడా తేడా రాలేదని గతంలో ఈసీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్న విషయం చంద్రబాబు ప్రస్తావించారు. 5 వీవీప్యాట్లలోని స్లిప్పులు లెక్కించాలని సుప్రీంకోర్టు చెబితే ఎన్నికల సంఘం వ్యతిరేకించిందని గుర్తుచేశారు. ఈవీఎంల్లోని ఓట్లకు, వీవీప్యాట్ స్లిప్పుల ఓట్లకు వ్యత్యాసం ఉంటే.... వీవీప్యాట్లనే ప్రాతిపదికగా తీసుకోవాలని ఈసీ చెప్పడం ఆశ్చర్యపరిచిందన్నారు. తేడా ఎందుకొచ్చిందో కారణాలు చెప్పడం, పరిశోధించాల్సిన అవసరాన్ని ప్రస్తావించకపోవడం ఏంటని నిలదీశారు. ఎంపిక చేసిన 2శాతం పోలింగ్ కేంద్రాల్లో వీవీప్యాట్లను లెక్కిస్తే..మిగిలిన 98శాతం ఈవీఎంలలో ట్యాంపరింగ్ జరిగితే పరిస్థితి ఏంటో చెప్పాలన్నారు.
తక్కువ సమయంలో 50 శాతం లెక్కించొచ్చు:ఈసీకి చంద్రబాబు లేఖ - చంద్రబాబు లేఖ
కేవలం 9గంటల్లోనే 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. 6రోజుల సమయం పడుతుందన్న ఈసీ లెక్క ముమ్మాటికీ తప్పేనన్నారు. తక్కువ సమయంలో 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులు లెక్కింపు ఎలా పూర్తిచేయొచ్చో వివరిస్తూ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.