ETV Bharat / state

చెరువులో టిక్​టాక్​ చేస్తూ యువకుని మృతి​ - Young man killed while doing tiktak in pond

టిక్​టాక్​ సరదా మరో యువకున్ని బలి తీసుకుంది. ఇంతకు ముందు వెన్నువిరగొట్టుకుని ఓ వ్యక్తి మృతి చెందగా... అదే టిక్​టాక్​ మాయలో పడి ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయి విగత జీవిగా తేలాడు. సరదాగా తిరిగొద్దామని వెళ్లి తమ కుటుంబంలో తీరని విషాదం నింపాడు.

చెరువులో టిక్​టాక్​ చేస్తూ యువకుడు మృతి​
author img

By

Published : Jul 11, 2019, 6:42 PM IST

చెరువులో టిక్​టాక్​ చేస్తూ యువకుడు మృతి​

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం దూలపల్లిలోని చెరువులో నరసింహ అనే యువకుడు మృతి చెందిన ఘటన రెండు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డికి చెందిన నరసింహ... సూరారంలో ఉంటున్న తన బంధువు వరుసకు అన్న అయిన ప్రశాంత్​ దగ్గరికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి మంగళవారం రోజున సరదాగా దూలపల్లి చెరువుకు వెళ్లారు. నీళ్లలో దిగి టిక్​టాక్ ఆప్​లోని పాటలను అనుకరిస్తూ వీడియో చిత్రీకరిస్తున్నారు.

ప్రశాంత్ వీడియో తీస్తున్న సమయంలో ఈత రాని నరసింహ... ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతయ్యాడు. ఆందోళనకు గురైన ప్రశాంత్ స్థానికుల సాయం కోరాడు. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా... ఘటనా స్థలిని చేరుకునే సరికి చీకటి పడింది. చేసేదేమీ లేక మరుసటి ఉదయం గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టిక్​టాక్​ మాయలో పడి విలువైన ప్రాణాలను తీసుకోవద్దని యువతను పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి: 'లంగర్ హౌస్ పాప కొడంగల్​లో దొరికింది...'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.