ఎన్నికల్లో అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఎలక్షన్ మిషన్ 2019 పై టెలీ కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ప్రజల్లో తెదేపా పట్ల సానుకూలత ఉందని కార్యకర్తల్లో.. ఉత్సహం కదం తొక్కుతోందని అన్నారు. 37 ఏళ్ల పార్టీ చరిత్రలో ఇంతటి అభిమానాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. ప్రచారం మరింత ఉద్ధృతం చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల యుద్ధంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఏమాత్రం ఏమరపాటు ఉండకూడదని పార్టీ నేతలకు సూచించారు. అభ్యర్థల ఎంపిక పారదర్శకంగా జరిగిందన్నారు. కొందరికి అసంతృప్తి సహజం.. భవిష్యత్‌లో తగిన గౌరవం, గుర్తింపు ఇస్తామన్నారు. తెదేపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ముగ్గురు మోదీలు కలిసి రాష్ట్రాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన తెదేపా గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
నేటి నుంచి చంద్రబాబు ప్రచారం...