న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని... రాష్ట్ర బార్ కౌన్సిల్ ఛైర్మన్ గంటా రామారావు హామీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్ర విభజన అనంతరం న్యాయవాదుల స్థితిగతులపై మొదటిసారిగా బార్ కౌన్సిల్ సమావేశమైంది. సంక్షేమం, వృత్తిరీత్యా వస్తున్న సమస్యలపై చర్చించారు. మృతిచెందిన లాయర్ల కుటుంబాలకు ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటు మంజూరు చేయటం హర్షణీయమన్నారు. హెల్త్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
