ETV Bharat / state

పార్టీ ముఖ్య నేతలతో నేడు చంద్రబాబు సమావేశం - chandrababu

విదేశీ పర్యటన ముగించుకుని చంద్రబాబు రాష్ట్రానికి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు తెదేపా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం
author img

By

Published : Jun 26, 2019, 12:02 AM IST

Updated : Jun 26, 2019, 6:28 AM IST

గన్నవరం విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం

తెదేపా అధినేత చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి చేరుకున్నారు. మంగళవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ప్రతిపక్షనేతకు తెదేపా నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వందలాది మంది కార్యకర్తలు అక్కడికి చేరుకుని జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. కారు డోరు వద్ద నిలుచుని కార్యకర్తలకు అభివాదం చేసిన చంద్రబాబు.. అనంతరం అక్కడి నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు.

చంద్రబాబు కాన్వాయ్ ని వాహనాల్లో అనుసరించిన తెదేపా కార్యకర్తల్ని... పోలీసులు ఎనికేపాడు, రామవరప్పాడు రింగురోడ్డు వద్దే ఆపేశారు. చంద్రబాబు నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేత నేపథ్యంలో వారిని వెళ్లనీయలేదు. కృష్ణా కరకట్ట మీదుగా చంద్రబాబు కాన్వాయ్ వెళ్లేందుకు అనుమతించారు. ఉదయం 11 గంటలకు పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ప్రజావేదిక కూల్చివేతతోపాటు తాజా పరిణామాలపై చర్చించనున్నారు.

ఇదీ చదవండీ...

ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం

Intro:AP_GNT_28a_25_UMA_YADAV_MURDER_AV_C10

CENTRE. MANGALAGIRI

RAMKUMAR. 8008001908

(. ) గుంటూరు జిల్లా మంగళగిరిలో తెదేపా నాయకుడు ఉమా యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు మంగళవారం రాత్రి 8:30 సమయంలో తన స్నేహితుడి తో కలిసి యాదవపాలెం లో లో ద్విచక్ర వాహనంపై వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు ఉమా యాదవ్ దారుణంగా హత్య చేశారు దీంతో మంగళగిరిలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు

Body:viss

Conclusion:only
Last Updated : Jun 26, 2019, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.