ETV Bharat / state

పీపీఏలపై ఉన్నత స్థాయి కమిటీ నియామకం

గత ప్రభుత్వ హయంలో అధిక ధరకు సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై సమీక్షకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డిలకు చోటుకల్పించారు.

author img

By

Published : Jul 2, 2019, 6:16 AM IST

పీపీఏలపై ఉన్నత స్థాయి కమిటీ నియామకం

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై (పీపీఏ) సమీక్షకు ప్రభుత్వం ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీని నియమించింది. 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదికను అందజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులాపల్లి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీలో ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇంధనశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌, సీఎం ప్రత్యేక కార్యదర్శి డి.కృష్ణ, దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ మాజీ సీఎండీ గోపాలరెడ్డి సభ్యులుగా ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న ఒప్పందాలను సమీక్షించడం, కొనుగోలు ధరల తగ్గింపుపై సంబంధిత సంస్థలతో కమిటీ సంప్రదింపులు జరపడంతోపాటు అవసరమైన సిఫార్సులను చేస్తుంది. కొనుగోలు సమయంలో దేశంలో అత్యల్పంగా ఉన్న పవన, సౌర విద్యుత్తు ధరలను కమిటీ పరిశీలిస్తుంది. ఏపీ జెన్‌కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల ద్వారా ఎంత ధరకు లభించే అవకాశం ఉందనే అంశాలతోపాటు అప్పటికే చేసుకున్న థర్మల్‌ ఒప్పందాలు, కేంద్ర విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నుంచి కేటాయింపులను పరిశీలిస్తుంది.
సంక్షోభంలో విద్యుత్తు సంస్థలు
విద్యుత్తు పంపిణీ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే రూ.20వేల కోట్లు చెల్లించాల్సి ఉందని వివరించింది. పవన, సౌర విద్యుత్తు కొనుగోళ్లకు సంబంధించి గత కొన్నేళ్లుగా అసాధారణ ధరలను చెల్లించేలా ఒప్పందాలు చేసుకోవడమే దీనికి ప్రధాన కారణమని తెలిపింది.

ఇదీచదవండి

'ఏపీ రైతు మిషన్' ఏర్పాటు... ఉత్తర్వులు జారీ

Intro:భాకరాపేట కనుమ దారిలో బోర్ లారీ బోల్తా .

Body:ap_tpt_38_01_boru_lorrylu_boltha_ap10100

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ దారి ప్రమాదాలకు నెలవైంది. పీలేరు నుంచి తిరుపతికి వస్తున్న బోరు లారీలు కనుమ దారిలో ఒకటి బోల్తా పడగా ,మరొకటి కొండను ఢీకొని ఆగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కి, సహాయకుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సూచికలు ఎన్నిఉన్నా డ్రైవర్లు పాటించకపోవడంతో ఈ ప్రమాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని వాహనచోదకులు తెలిపారు. చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Conclusion:పి .రవి కిషోర్ ,చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.