దేశంలోని అన్ని గ్రామీణ బ్యాంకుల్లోకెల్లా అత్యధికంగా వ్యాపార లావాదేవీలు నిర్వహించి... వచ్చే ఆర్థిక ఏడాది ముగింపు నాటికి మొదటి స్థానానికి చేరుకోవటమే తమ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకు ఛైర్మన్ ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫలితాలను హైదరాబాద్‌లో వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన తమ బ్యాంకు గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్నామని వివరించారు. ఏపీజీవీబీ వ్యాపార లావాదేవీలు రికార్డు స్థాయిలో 30వేల కోట్లకు మించిందన్న ప్రవీణ్‌కుమార్ 2017-18 ఆర్థిక ఏడాది ముగింపులో రూ.28,650 కోట్ల నుంచి రూ.32,714 కోట్లకు పెరిగి 14.19 శాతం వృద్ధి నమోదు చేసుకున్నట్లు తెలిపారు. డిపాజిట్లపై 12.02 శాతం, అడ్వాన్సుల్లో 16.36 శాతం వృద్ధి నమోదైనట్లు వివరించారు. బ్యాంకు అవుట్ స్టాండింగ్ మొత్తంలో 59 శాతం అంటే రూ.1883 కోట్లు గృహ రుణాలు ఇచ్చినట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి