ETV Bharat / state

తెలంగాణ పోలీస్... ఏపీ ఇంటెలిజెన్స్​ బాస్! - ఆంధ్రప్రదేశ్

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర పేరు దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఈ పదవికి ఆంధ్రప్రదేశ్​లోని ముగ్గురు అధికారులు పోటీ పడుతుండగా... వైఎస్ జగన్ స్టీఫెన్​ను నియమించేందుకు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వైఎస్సార్‌కు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్​గా పనిచేయటం.. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండటం కారణంగా తెలుస్తోంది. తెలంగాణ అధికారి ఆయిన స్టీఫెన్‌ రవీంద్ర... డేటా చౌర్యం కేసులో విచారణాధికారిగా ఉన్నారు.

ap_inteligence_new_boss_stephen ravindra
author img

By

Published : May 27, 2019, 4:49 PM IST

Updated : May 27, 2019, 9:32 PM IST

ఇంటెలిజెన్స్ డీజీ పదవికి కుమార విశ్వజిత్, రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ రామాంజనేయులు పోటీ పడుతున్నారు. అనూహ్యంగా స్టీఫెన్ రవీంద్ర పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్టీఫెన్ ప్రస్తుతం తెలంగాణ కేడర్​లో హైదరాబాద్ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. స్టీఫెన్ కెరీర్​లో నక్సలిజం, ఫ్యాక్షనిజం, డ్రగ్ మాఫియాపై సమర్థవంతంగా పని చేశారనే ముద్ర వేసుకున్నారు.

స్టీఫెన్ విద్యాభ్యాసం
స్టీఫెన్ విద్యాభ్యాసం హైదరాబాద్ సెయింట్ పాల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్​లో జరిగింది. నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు. అనంతరం సివిల్స్ రాసి ఐపీఎస్​లో చేరారు. 1999 బ్యాచ్​కు చెందిన స్టీఫెన్ రవీంద్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్​గా మొదటిసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా 2004 వరకు పని చేశారు. 2004లో వరంగల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతపురం ఎస్పీగా పని చేసిన సమయంలో ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారు.

డ్రగ్ మాఫియాకు చుక్కలు
2008 నుంచి 2009 వరకు దివంగత మాజీ సీఎం వైఎస్సార్ సీఎస్ఓగా పని చేశారు. ఆ సమయంలో వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. కరీంనగర్ ఎస్పీగా, ఈస్ట్​ జోన్ డీసీపీ, వెస్ట్ జోన్ డీసీపీగా పని చేశారు. వెస్ట్ జోన్ డీసీపీగా డ్రగ్ మాఫియాపై విరుచుకుపడ్డారు. గ్రేహైండ్స్ గ్రైప్ కమాండర్​గా, సైబరాబాద్ జాయింట్ కమిషనర్​గా పనిచేశారు. అదిలాబాద్, వరంగల్​లో పనిచేసినపుడు మావోయిస్టుల అణచివేతలో సమర్థవంతంగా పనిచేశారు.

మళ్లీ వాళ్లిద్దరూ కలిసే..
వరంగల్ ఎస్పీగా పనిచేసినపుడు గౌతమ్ సావాంగ్ వరంగల్ డీఐజీగా పని చేసేవారు. ఆయన సూచనలతో మావోయిస్టుల ఎత్తులకు పైఎత్తులు వేశారు. ప్రస్తుతం ఏపీకీ నూతన డీజీపీగా గౌతమ్ సావాంగ్ పేరు తెరపైకి రావటం .. ఇంటెలిజెన్స్ చీఫ్​గా స్టీఫెన్ రవీంద్ర పేరు బహిర్గతం కావటం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Rajouri (JandK), May 27 (ANI): Indian Army recovered Improvised Explosive Device (IED) from Jammu-Poonch highway near Kallar chowk on Monday preventing a possible attack. The explosive material was successfully diffused by army's bomb disposal squad. Investigation into the matter has been started.
Last Updated : May 27, 2019, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.