కేంద్రం ఇచ్చే సాయంతో సంబంధం లేకుండా రైతులకు పెట్టుబడి కోసం రూ.9 వేలు ఇస్తామని...సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. తొలి విడతలో రూ.4 వేలు... రెండో విడతలో రూ.5 వేలు ఇస్తామని వివరించారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సాయం ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అన్నదాతా సుఖీభవ పథకంపై సమీక్ష అనంతరం... మంత్రి సోమిరెడ్డి మాట్లాడారు. కేంద్ర సాయం వర్తించని రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)