ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బిశ్వభూషణ్ హరిచందన్ ఈనెల 24న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ రోజు ఉదయం 11:30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 23న భువనేశ్వర్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి చేరుకొని వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం విజయవాడ చేరుకుంటారు. విజయవాడలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు క్యాంపు కార్యాలయాన్ని రాజ్‌భవన్‌గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ప్రకటన జారీ చేయనున్నట్లు సమాచారం. భవనంలోని మొదటి అంతస్థుని గవర్నర్ నివాసం కోసం, కింది భాగాన్ని కార్యాలయ నిర్వహణకు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇదీచదవండి