ETV Bharat / state

క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయండి: సీఎస్ - AP CS LV Subramanyam

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పట్ల నిబద్ధతతో నిర్వహించ తలపెట్టిన స్పందన కార్యక్రమంలో భాగంగా... పథకాలపై గ్రామపంచాయతీల్లో డిస్​ప్లే బోర్డులు పెట్టాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. 2నెలల్లోగా జిల్లా పోర్టల్​ను ప్రారంభించాలని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో స్పందన కార్యక్రమంపై ఉన్నతాధికారులు, కార్యదర్శులతో సీఎస్ సమావేశం నిర్వహించారు.

సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం
author img

By

Published : Jul 11, 2019, 7:40 AM IST

Updated : Jul 11, 2019, 9:44 AM IST

ప్రతీ సోమవారం అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ స్పందన కార్యక్రమాన్ని తప్పక నిర్వహించాలని... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశించారు. ప్రతి మూడో శుక్రవారం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి స్పందన కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయాలన్న సీఎస్... ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. ప్రజా ఫిర్యాదుల స్థితి తెలుసుకునేలా 2నెలల్లోగా జిల్లా పోర్టల్​ను తీసుకురావాలని సీఎస్ అధికారులను ఆదేశించారు.

శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు రూపకల్పనలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. అనవసర ఖర్చులు తగ్గించి వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో ఆసుపత్రులు, విద్యా సంస్థలు, వసతి గృహాల నిర్వహణపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం... రాత్రిపూట వసతిగృహాల్లో బస చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రంలోని వివిధ పాఠశాలల పరిస్థితిని రెండేళ్లలో పూర్తిగా మెరుగపర్చాలనే ఆలోచన చేస్తున్నారని... వాటి ప్రస్తుత ఫొటోలు తీసి వైబ్​సైట్లో అప్​లోడ్ చేసేలా చూడాలన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వివరాలతో గ్రామస్థాయిలో ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇలా చేయడం ద్వారా ప్రజలందరికీ పూర్తి అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యంగా సంక్షేమ శాఖలు ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మూడంచెల పరిపాలనా విధానం అమల్లో భాగంగా జిల్లా, మండల, గ్రామస్థాయి సిబ్బందికి బాధ్యతలు అప్పగించాలన్నారు. జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సీఎస్ స్పష్టం చేశారు. రెండు నెలల్లో జిల్లా పోర్టల్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు.

ఇదీ చదవండీ...

'ఒకేసారి లక్షా 13వేల కోట్ల అప్పు ఎలా పెరిగింది'

Intro:Ap_gnt_62_10_ten_ekaras_gaddi_vami_dahanam_av_AP10034

Contributor : k. Vara prasad (prathipadu), guntur

Anchor : గుంటూరు జిల్లా కాకుమాను గ్రామంలో 10 ఎకరాల గడ్డి వాములు గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. వాటి విలువ 1లక్ష రూపాయలు ఉంటుంది అని అంచనా. బాధిత రైతు కొండపాటూరు శ్రీ నివాసరావు ఏవరొ తనమీద కోపంతో ఈ పని చేసి ఉంటారని ఆవేదన వ్యక్తం చేశాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని స్థానికులతో పాటు మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. బాపట్ల అగ్నిమాపక శకటం సిబ్బంది వచ్చి మంటలు ఆర్పీ వేశారు.
Body:EndConclusion:End
Last Updated : Jul 11, 2019, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.