ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశారు. అనంతరం న్యాయవాదుల బృందం మాట్లాడుతూ... తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. న్యాయవాదులకు హెల్త్ కార్డు, ఇన్సూరెన్స్, స్టైఫండ్ ఇవ్వాలని కొరినట్లు వివరించారు. హైకోర్టు లాయర్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కొరామని చెప్పిన న్యాయవాదులు... సీఎం జగన్ సానుకూలంగా స్పందించారన్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తానని జగన్ చెప్పినట్లు తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన జగన్కు ఏపీ బార్ కౌన్సిల్ చైర్మన్ గంట రామారావు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండీ...