ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రస్తుతం వసూలు చేస్తోన్న ఫీజు వివరాలను మంత్రి ఆదిమూలపు సురేష్ యాజమాన్యాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని కళాశాలల్లో ఒకే విధంగా ఫీజు వసూలు చేయాలని ఆదేశించారు. కొన్ని కళాశాలల్లో ఎక్కువ ఫీజు ఎక్కువ వసూలు చేస్తున్నాయన్నారు. ఫీజు మార్పులపై యాజమాన్యాల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రభుత్వం... ఫీజు నియంత్రణ కమిటీని చేయడాన్ని యాజమాన్యాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఫీజు నిర్ణయంపై వారం రోజుల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సురేష్ సమావేశం అనంతరం స్పష్టం చేశారు.
గతంలో ఉన్న ఫీజునే వసూలు చేయాలా... లేక మార్పులు చేయాలా అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. రెండు రోజుల్లో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలు పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. ఎంసెట్ కౌన్సెలింగ్లో అగ్రవర్ణాల పేదలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా సీట్లు పెంచుతామని మంత్రి సురేష్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండీ...