ETV Bharat / state

కార్తికమాసం స్పెషల్​​.. యాదాద్రి ఆలయానికి రికార్డు స్థాయి ఆదాయం - యాదాద్రి దేవస్థానం ఆదాయం

Yadadri Temple Karthika Masam Income: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. కార్తిక మాసం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో యాదాద్రిని దర్శించుకున్నారు. మొత్తం 23 రోజుల్లో వివిధ విభాగాలు కలుపుకొని రూ.14,66,38,097 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.

యాదాద్రి
యాదాద్రి
author img

By

Published : Nov 24, 2022, 4:23 PM IST

Yadadri Temple Karthika Masam Income: పవిత్ర కార్తిక మాసంలో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. కొండ కింద నూతన వ్రత మండపంలో ప్రతి రోజు ఆరు బ్యాచ్​లుగా వ్రతాలు నిర్వహిస్తున్నారు. 21,480 దంపతులు శ్రీ సత్యనారాయణస్వామి వ్రత పూజలు ఆచరించారు. మొత్తం 23 రోజుల్లో వివిధ విభాగాలు కలుపుకొని రూ.14,66,38,097 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి తెలిపారు.

గత ఏడాది 19,176 వ్రత పూజలు నిర్వహించగా.. వివిధ విభాగాలు కలుపుకొని మొత్తం రూ. 7,35,10,307 ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుత మాసం రూ.7,31,27,790 ఆదాయం అదనంగా సమకూరింది. యాదాద్రి ఆలయ పునః ప్రారంభం అనంతరం స్వయంభువులను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో యాదాద్రికి తరలివస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.