ETV Bharat / state

మళ్లీ తెరపైకి వాన్‌పిక్ భూముల వ్యవహారం... వివరాలు సేకరిస్తున్న అధికారులు

Wanpic lands: బాపట్ల జిల్లాలోని వాన్‌పిక్ భూముల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. వాన్‌పిక్‌ భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తాజా పరిస్థితిపై మండలాల వారీగా నివేదిక సిద్ధం చేస్తున్నారు.

Wanpic lands
వాన్‌పిక్ భూముల వ్యవహారం
author img

By

Published : Nov 3, 2022, 11:59 AM IST

Wanpic lands: వాన్‌పిక్ భూముల వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. బాపట్ల జిల్లాలోని తీర ప్రాంతంలో ఉన్న వాన్‌పిక్‌ భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. తాజా పరిస్థితిపై మండలాల వారీగా నివేదిక తయారు చేస్తున్నారు. 2008లో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని సముద్ర తీర ప్రాంతాల్లో వాన్‌పిక్‌ ప్రాజెక్టు కోసం 22 వేల ఎకరాలు సేకరించారు. అందులో ఎసైన్డ్‌, ప్రభుత్వ, పట్టా భూములు ఉన్నాయి.

అత్యధికంగా నిజాంపట్నం మండలంలో 10 వేల ఎకరాలకుపైగా తీసుకున్నారు. ఎసైన్డ్‌, పట్టా భూముల రైతులకు పరిహారాన్ని అందజేశారు. అయితే...వాన్‌పిక్‌ ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయని సీబీఐ కేసులు నమోదు చేయడంతో ప్రాజెక్టు నిలిచిపోయింది. ప్రస్తుతం వాన్‌పిక్‌ భూములను రైతులే సాగు చేసుకుంటున్నారు. భూములను లీజుకు, కౌలుకు ఇచ్చారు.

బాపట్ల కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత...వాన్‌పిక్‌ భూములు ఈ జిల్లా పరిధిలోకి వచ్చాయి. ఈ తరుణంలో రేపల్లె, నిజాంపట్నం, పిట్టలవానిపాలెం, కర్లపాలెం, బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాంలలో వాన్‌పిక్‌, అసైన్డ్‌ భూముల తాజా పరిస్థితి పరిశీలించి, పూర్తివివరాలతో నివేదిక ఇవ్వాలని స్థానిక రెవెన్యూ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. భూములు ఎంత విస్తీర్ణంలో ఎవరి ఆధీనంలో ఉన్నాయి? రైతులకు పరిహారం పూర్తిగా అందిందా? భూముల తాజా స్థితి, భూ రికార్డుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని గోప్యంగా చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.