Two Bullocks Died In Road Accident: బాపట్ల జిల్లా మార్టూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోలో తీసుకువెళ్తున్న రెండు ఎద్దులు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలైయ్యాయి. బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడుకు చెందిన రైతులు.. కృష్ణా జిల్లా కైకలూరులో నిర్వహించిన ఎద్దుల పందేల్లో పాల్గొని మూడో బహుమతి సాధించారు. పందేలు ముగిశాక ఎద్దులను తీసుకుని టాటా ఏస్‌లో స్వగ్రామానికి వెళుతుండగా మార్టూరు వద్ద ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మైసూర్ రకానికి చెందిన ఎడ్ల జత అక్కడిక్కక్కడే మృతి చెందాయి. క్షతగాత్రులను గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మార్టూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి