ETV Bharat / state

ఇష్టం లేకపోయినా మనసు చంపుకుని పని చేస్తున్నా - వైసీపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు - వైసీపీ వరెస్స్ ఎంపీ మోపిదేవి వెంకటరమణ

MP Mopidevi Venkataramana Key Comments: వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇష్టం లేని వ్యక్తుల కోసం మనసు చంపుకుని పని చేయవలసి వస్తుందని మోపిదేవి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో కొనసాగాలంటే ఇలాంటివి తప్పవని ఆయన వ్యాఖ్యానించారు.

MP Mopidevi Venkataramana Key Comments
MP Mopidevi Venkataramana Key Comments
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 25, 2023, 10:19 PM IST

MP Mopidevi Venkataramana Key Comments: బాపట్ల జిల్లా రేపల్లె రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. జగన్ బాధ్యుల మార్పుతో రేపల్లె వైసీపీలో చీలికలు మొదలయ్యాయి. ఎంపీ మోపిదేవి వెంకటరమణను కాదని, రేపల్లె నియోజకవర్గ ఇంఛార్జిగా ఈవూరు గణేష్‌ను నియమించారు. ఈ నేపథ్యంలో వైసీపీ పెద్దలపై ఎంపీ మోపిదేవి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఓ కార్యక్రమానికి వెళ్లిన ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని పరిస్థితులలో మనసు చంపుకుని ఇష్టం లేకపోయినా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. ఎంపీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపైనే ఈ రకంగా వ్యాఖ్యానించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇష్టం లేకపోయినా మనస్సు చంపుకుని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది: వైసీపీ ఎంపీ

విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు: రాజకీయంలో కొన్ని ఇష్టం లేని పనులను కూడా మనసు చంపుకుని చేయాల్సిన పరిస్థితి ఉందనీ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు అన్నారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలో నిర్వహించిన కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి మాట్లాడారు. చదువు కొన్నాం అన్నదానికి, చదువుకున్నాము అనడానికి చాలా వ్యత్యాసం ఉందనీ పేర్కొన్నారు. కార్పొరేట్ వ్యవస్థ వచ్చి చదువు కొనలేని పరిస్థితి ఏర్పడిందని మోపిదేవి పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక విద్యా వ్యవస్థలో ఎన్నో సంస్కరణలను తీసుకు వచ్చిందని తెలిపారు. తద్వారా విద్యను అందరికీ అందేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

టీడీపీలోకి వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు - చర్చనీయాంశంగా మోపిదేవి ప్రధాన అనుచరుడి పార్టీ మార్పు

ఇష్టం లేకపోయినా: కేవీఆర్ అండ్ జయలక్ష్మి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ఇవ్వడం అభినందనీయమని తెలిపారు. తాను చదువుకునే సమయంలో ఎస్​ఎఫ్ఐలో పని చేశానని గుర్తు చేశారు. రాజకీయల్లోకి వచ్చాక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, అన్నింటినీ సమన్యాయం చేస్తూ ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కొన్ని పరిస్థితులలో మనసు చంపుకుని, ఇష్టం లేకపోయినా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని అన్నారు. మోపిదేవి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. ఇటీవల రేపల్లె వైసీపీ నియోజకవర్గం ఇంఛార్జ్​గా ఉన్న మోపిదేవి వెంకటరమణను తప్పించారు. ఆయన స్థానంలో గణేష్​ను నియమించారు. ఈ సమయంలో ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నియోజకవర్గంలో పలు విమర్శలకు తావిస్తోంది.

మత్య్సకార సంఘాల ఆగ్రహం: ఇప్పటికే మోపిదేవిని తొలగిస్తే తీవ్రపరిణామాలు ఉంటాయని మత్య్సకార సంఘాలు సైతం వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. ఈ మేరకు మంగళగిరిలో సమావేశం అయిన మత్య్సకార సంఘాలకు చెందిన నేతలు మోపిదేవికి మద్దతుగా నిలిచాయి. తనను కాదని మరో వ్యక్తికి సీటు కేటాయిస్తే తామంతా జగన్​ను ఓటమి కోసం పోరాడాల్సి వస్తుందని వైసీపీ నేతల్ని హెచ్చరించారు. 20 స్థానాలు ఇవ్వాల్సిన మత్య్సకారులకు కేవలం ఒక్కటి రెండు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకోవాలనుకుంటున్నారని ఆరోపించారు.

'వైసీపీ గద్దె దిగేవరకు పోరాడతాం' - మోపిదేవికి మద్దతుగా మత్స్యకార సంఘాల సమావేశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.