ETV Bharat / state

అధికార పార్టీ నాయకులు అండతో.. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు - Prakasam Latest News

Illegal mining of sand in Gundlakamma reservoir: ఇసుక అక్రమ వ్యాపారానికి వ్యాపారులు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. నదులు, నదీ తీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వి సొమ్ము చేసుకుంటున్న వీరు ఇంకా చాలనట్లు జలాశయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమ తవ్వకాలకు సిద్ధమవుతున్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలో విస్తరించిన గుండ్లకమ్మ రిజర్వాయర్​లో ఇసుక అక్రమ తవ్వకాలకు డ్రెడ్జింగ్​ యంత్రాలను తీసుకొచ్చి దింపారు. రైతులకు నష్టం కలిగేలా నదిలో డ్రెడ్జర్‌తో ఇసుక తవ్వకాలు చేస్తే ఒప్పుకోమని వైవీ భద్రారెడ్డి అన్నారు. నది మధ్యలో.. అక్రమంగా తరలించిన డ్రెడ్జింగ్‌ యంత్రాలను రైతులతో కలిసి ఆయన పరిశీలించిన అనంతరం మంత్రి మేరుగ నాగార్జునకు ఫోన్‌ చేసి గుండ్లకమ్మలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దొంటూ...ఆయన విజ్ఞప్తి చేశారు.

Illegal mining of sand in Gundlakamma reservoir
జలాశయ గర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు
author img

By

Published : Jan 4, 2023, 10:48 AM IST

Illegal mining of sand in Gundlakamma reservoir: ఇసుక అక్రమ వ్యాపారానికి వ్యాపారులు రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. నదీ తీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఇసుక తవ్వి సొమ్ము చేసుకుంటున్న వీరు ఇంకా చాలనట్లు జలాశయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమ తవ్వకాలకు సిద్ధమవుతున్నారు. అధికార పార్టీ నాయకులు అండదండలతో ఏకంగా డ్రెడ్జింగ్ యంత్రాలను జలాశయాల్లోకి దించి ఇసుక తోడేందుకు ఏర్పాటు చేసుకున్నారు. ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలో విస్తరించిన గుండ్లకమ్మ రిజర్వాయర్​లో ఇసుక అక్రమ తవ్వకాలకు డ్రెడ్జింగ్​ యంత్రాలను తీసుకొచ్చి దింపారు. అధికారులు అనుమతి లేవని పేర్కొంటున్నప్పటికీ తవ్వకాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అధికార పార్టీ నాయకులు అండతో జలాశయ గర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు

నదుల్లో, వాగుల్లో ఇసుక నిల్వలు తరిగిపోవడంతో అక్రమార్కులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు . ఇసుకను యంత్రాల సహాయంతో తోడి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం మణికేశ్వరం సమీపంలోని గుండ్లకమ్మ నది మధ్యలో డ్రెడ్జర్ సహాయంతో ఇసుకను తవ్వేందుకు సర్వం సిద్ధం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం సమీపంలో డ్రేజ్జర్​ సహాయంతో నదిలో ఇసుక తవ్వేందుకు ప్రయత్నించగా అధికారులు అడ్డుకున్నారు.

అప్పటి నుంచి ఈ డ్రెడ్జర్ను గుండ్లకమ్మ పరీవాహక గ్రామాల్లో రహస్యంగా ఉంచారు. మూడు రోజుల క్రితం మణికేశ్వరం దగ్గర నది మధ్యలో నిలిపి ఉంచారు. ఈ యంత్రాలను చిత్రీకరిస్తూ అందులోని సిబ్బంది కొందరు వేరే పడవలో వెళ్లిపోయారు. నదిలో తవ్విన ఇసుకను ఒడ్డుకు చేర్చేందుకు అవసరమైన పైపులు అమర్చలేదని, వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని సిబ్బంది ఒకరు చెప్పారు. డ్రెడ్జర్ గుంటూరుకు చెందిన వ్యక్తిదిగా వీరు తెలిపారు.

రైతులకు నష్టం కలిగేలా నదిలో డ్రెడ్జర్‌తో ఇసుక తవ్వకాలు చేస్తే ఒప్పుకోమని వైవీ భద్రారెడ్డి అన్నారు. నది మధ్యలో....అక్రమంగా తరలించిన డ్రెడ్జింగ్‌ యంత్రాలను రైతులతో కలిసి ఆయన పరిశీలించి అక్రమ ఇసుక తవ్వకాలను నిషేధించాలన్నారు. గుండ్లకమ్మలో ఇసుక తవ్వకాల వల్ల చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అనంతరం మంత్రి మేరుగ నాగార్జునకు ఫోన్‌ చేసి గుండ్లకమ్మలో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వద్దొంటూ...ఆయన విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.