ETV Bharat / state

Irrigated or Dry Paddy Crops in Murukondapadu: సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంట.. ఉరితాళ్లతో రైతుల నిరసన - Bapatla District formers News

Irrigated or Dry Paddy Crops in Murukondapadu: సాగునీరు లేక వందల ఎకరాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమను ఆదుకోవాలని..బాపట్ల జిల్లా మురుకొండపాడు రైతులు మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. సీఎం జగన్.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకొచ్చి రైతుల కష్టాలను తెలుసుకోవాలని డిమాండ్ చేశారు.

Etv Bharat
Irrigated_or_Dry_Paddy_Crops_in_Murukondapadu
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 23, 2023, 11:16 AM IST

సాగునీరు లేక ఎండిపోతోన్న వరి పంటలు.. ఉరి తాళ్లతో రైతులు నిరసనలు

Irrigated or Dry Paddy Crops in Murukondapadu: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి వరి నాట్లు వేస్తే.. వర్షం లేక, సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతూ.. ఏం చేయలో దిక్కుతోచక సతమతమవుతున్నారు. మరోవైపు పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక, కుటుంబ సభ్యులను పోషించుకోలేక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. తాజాగా బాపట్ల జిల్లా మురుకొండపాడుకు చెందిన కొంతమంది రైతులు.. మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

Murukondapadu Farmers Fire on YCP Govt: బాపట్ల జిల్లా మురుకొండపాడులో సాగునీరు లేక వరి పంటలను ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ.. పంట పొలాల్లోనే మెడకు ఉరి తాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కృష్ణా పశ్చిమ డెల్టా.. చివరి ఆయకట్టు ప్రాంతమైన బాపట్లలో సాగునీరు అందక.. వేల ఎకరాల్లో వరిపైరు ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందించి రైతులను కాపాడుకోలేని దైన్యస్థితిలో.. జగన్‌ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకొచ్చి కృష్ణా డెల్టా ప్రాంతాలను పర్యటించాలని.. సాగునీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న రైతన్నల కష్టాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Chilli Farmers Problems: అందని సాగు నీళ్లు.. పంటకు తెగుళ్లు.. మిర్చి రైతు కన్నీళ్లు

TDP Leader Vegesina Narendra Comments: ఈ క్రమంలో మురుకొండపాడు రైతుల మనోవేదనను తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేసిన నరేంద్ర రైతులన పరామర్శించి, పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..''కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని పంటల పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంటే.. జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎక్కడ తిరుగుతున్నారు. ప్రతి ఎకరానికి 20వేల వరకు వెంచించిన రైతులు.. పంటను కాపాడుకోవడం కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. రైతులు బాధ పడుతుంటే ఈ ప్రభుత్వం, అధికారులు మానవత్వం లేకుండా చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా రైతుల బాధలను తెలుసుకుని వారిని ఆదుకోవాలి'' అని వేగేసిన నరేంద్ర డిమాండ్ చేశారు.

Farmers Agitation with Holding Pesticide: పంటలు ఎండిపోతే మరణమే.. పురుగు మందు డబ్బాలతో రైతుల ఆందోళన

''వర్షం, సాగునీరు లేక వరి పంటలన్నీ ఎండిపోయాయి. మాకు ఏ దిక్కు లేదండి. నీళ్లు లేక మేము ఏం చేయలేకపోతున్నాం. బాకీలు తెచ్చి ఏకరానికి పది వేల చొప్పున పెట్టాము. ప్రభుత్వం నీరు అందించకపోతే మేము ఉరి వేసుకుని చనిపోవటమే తప్పా, మరో దారి లేదు. దయచేసి ప్రభుత్వం నీరు అందించాలని వేడుకుంటున్నాము.''- రైతులు, మురుకొండపాడు

Farmers Worried on Crops Over Power Cuts in AP: రైతులను కలవరపెడుతున్న విద్యుత్ కోతలు.. ఎండిపోతున్న పంటలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.