ETV Bharat / state

Hanuman Jayanti 2023:రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు - ఏపీ తాజా వార్తలు

Hanuman Jayanti Celebrations 2023 : రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం హనుమాన్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.  పలు ప్రాంతాల్లో వైభవంగా హనుమాన్‌ శోభాయాత్ర సాగింది. జై శ్రీరాం, జై హనుమాన్‌ నినాదాలతో ఆలయాలు మార్మోగాయి. ఆంజనేయ స్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Hanuman Jayanti 2023
రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు
author img

By

Published : May 15, 2023, 10:55 AM IST

Updated : May 15, 2023, 12:13 PM IST

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

Hanuman Jayanti Celebrations 2023 : విజయవాడలో హనుమాన్‌ శోభయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. విశ్వహిందూ పరిషత్తు, బంజరంగ్‌దళ్‌ సంయుక్త ఆధ్వర్యంలో బీఆర్‌టీఎస్‌ రోడ్డులోని రామకోటి నుంచి సత్యనారాయణపురం వరకు ఈ యాత్ర సాగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, తాళ్లాయపాలెం శైవక్షేత్ర పీఠాధిపతులు శివస్వామి, విజయవాడలోని హనుమద్దీక్షా పీఠాధిపతి దుర్గాప్రసాద్‌ స్వామి తదితరులు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. జైశ్రీరాం, జై హనుమాన్‌ నినాదాలతో మారు మోగించారు. కాషాయ పతాకాలను చేతపట్టుకుని ద్విచక్ర వాహనాలతో ప్రదర్శన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హనుమత్‌ జయంతిని పురస్కరించుకుని అనేక చోట్ల శోభాయాత్ర నిర్వహించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. ధైర్యం, భక్తి, బలానికి, విధేయతకు, నమ్మకానికి, నిస్వార్ధతకు, చురుకుదనానికి, తెలివి వంటి గొప్పగుణాలకు ఆంజనేయుడు ప్రతీక అని అన్నారు.

హనుమాన్ శోభయాత్ర : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని హనుమాన్ శోభయాత్ర బైక్ ర్యాలీను నిర్వహించారు. మండలంలోని ప్రసిద్ధ హనుమాన్ ఆలయమైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద నుంచి ప్రారంభమైన శోభాయాత్ర జంగారెడ్డిగూడెం పట్టణ పురవీధుల మీదుగా సాగింది. శోభ యాత్రలో ద్విచక్ర వాహనాలపై వందలాది హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. పట్టణ పురవీధుల్లో హనుమాన్ నామస్మరణతో మారు మోగాయి. హిందూ ధర్మానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, నేటి యువతకు హిందూధర్మం విశిష్టత తెలియ చెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని విశ్వవిందు పరిషత్ రాష్ట్ర కార్యదర్శి తనికెళ్ళ రవి తెలిపారు.

హిందూ ధర్మ పరిరక్షణ : నూజివీడు పట్టణంలో హనుమాన్ భక్తులు జెండా చేత పట్టి బైక్ ర్యాలీ నిర్వహించారు. జై హనుమాన్ జై జై హనుమాన్ నినాదాలు చేశారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా ఐక్యంగా ముందడుగు వేయాలన్నారు. కుల మతాలకు అతీతంగా సంఘటిత శక్తిగా ప్రపంచ పటంలో నిలవాలని పిలుపునిచ్చారు.

జాతీయ రహదారిపై యాత్ర : కృష్ణా జిల్లా గన్నవరంలో హనుమాన్‌ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ విశేషంగా ఆకట్టుకుంది. పట్టణంలోని చెన్నై-కోల్​కతా జాతీయ రహదారి మీదుగా సాగిన ఈ యాత్రలో పెద్ద సంఖ్యలో హనుమాన్ భక్తులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

టీటీడీ తరుపున పట్టు వస్త్రాలు : తిరుమలలో హనుమాన్‌ జయంతి ఉత్సవాలను టీటీడీ వేడుకగా నిర్వహించింది. ముందుగా హనుమంతుడు జన్మస్థలంగా ప్రకటించిన ఆకాశగంగ అంజనాద్రిలో ఉదయం 8:30 గంటలకు బాలంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం శ్రీవారి ఆలయం ఎదుట బేడి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు అర్చకులు నిర్వహించారు. జపాలి తీర్థంలోని హనుమంతుడికి అభిషేకాలు, నివేదనలు నిర్వహించారు. జాపాలిలోని హనుమంతుడికి టీటీడీ తరుపున జేఈఓ వీర బ్రహ్మం పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటి ఘాటు రోడ్డులోని ఏడోవ మైలు వద్ద ప్రసన్న ఆంజనేయ స్వామి వారికి పూజాలు,నివేదనలు సమర్పించారు. తిరుమలలో ఈ నెల 18 వరకు హనుమజ్జయంతి ఉత్సవాలను ఘానంగా నిర్వహించనుంది..

మామిడి పండ్లతో పూజలు : బాపట్ల జిల్లా అద్దంకి మండలం సింగరకొండపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమంత్ జయంతి సందర్భంగా ఆలయంలో స్వామి వారికి ఉదయం లక్ష తమలపాకుల అర్చన మరియు మామిడి పండ్లతో పూజలు నిర్వహించారు. స్వామి వారికి కొంత మంది భక్తులు కొన్ని విలువైన వస్తువులను ఆలయ ఈఓ సుభద్రకు అందించారు. సాయంత్రం సమయంలో సహస్ర దీపాలను వెలిగించి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు.

లక్ష ఎనిమిది వేల తమలపాకులతో నాగవళ్లి దళార్చన : నెల్లూరులో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని శబరి క్షేత్రం వద్ద వెలసియున్న ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి లక్ష మల్లెలార్చన నిర్వహించారు. కొండాయాపాలెం గేటు వద్దున్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి. సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు లక్ష ఎనిమిది వేల తమలపాకులతో నాగవళ్లి దళార్చన నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారికి అర్చన చేశారు. స్టోన్ హౌస్ పేట ఆలయం, మూలపేట కోనేటిమిట్ల ఆంజనేయస్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి.

జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలు : కాషాయపు జెండాల రెపరెపలు జై శ్రీరామ్ జై హనుమాన్ అన్న నినాదాలు మధ్య శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణంలో హనుమాన్ జయంతి శోభాయాత్ర కన్నుల పండుగ సాగింది హిందూపురం పట్టణంలోని సుగురు ఆంజనేయ స్వామి ఆలయం నుండి మేలాపురం ఆంజనేయస్వామి ఆలయం వరకు హిందూ సురక్ష సేవా సమితి ఆధ్వర్యంలో శోభాయాత్ర కొనసాగింది. యువత ద్విచక్ర వాహనాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్రలో హనుమాన్ విగ్రహాలు ఆకర్షణగా నిలిచాయి. పట్టణ వీధులు కాషాయపు జెండాలతో నిండుగా కనిపించాయి. ఈ సందర్భంగా జై శ్రీరామ్ జై హనుమాన్ నినాదాలు పట్టణమంతా మారుమోగాయి.

ఆంజనేయ స్వామికి పూజలు : హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని నంద్యాల బైటిపేటలో వెలిసిన శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. నంద్యాల సంజీవనగర్ కోదండ రామాలయంలో వెలిసిన ఆంజనేయస్వామికి పూజలు చేశారు.

ఇవీ చదవండి

Last Updated : May 15, 2023, 12:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.