Burning of anchored boat: సముద్రంలో లంగర్ వేసిఉన్న బోటు దహనమైన ఘటన బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవు సముద్రంలో జరిగింది. మెరైన్ ఎస్ఐ సుబ్బారావు కథనం ప్రకారం బోగిరెడ్డి వెంకటలక్ష్మి పేరుతో అనుమతి ఉన్న బోటు.. చేపలు వేటాడేందుకు వాడరేవు సముద్రంలో లంగరు వేసి పెట్టారని తెలిపారు. ఇంజనులో సాంకేతిక సమస్య కారణంగా బోటు దహనమైనట్లు పేర్కొన్నారు. బోటులో ఉన్న ధనుంజయ్ అనే మత్స్యకారుడు సమీపంలోని మరో బోటులోకి వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నాడు. సమాచారం అందుకున్న మెరైన్ ఎస్ఐ సుబ్బారావు సముద్రంలో దహనమైన బోటును పరిశీలించారు. మెుత్తం రూ.15 లక్షల నష్టం వాటిల్లిందని బోటు యజమాని తెలిపారు. ప్రమాదానికి గలకారణాలను విచారిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
ఇవీ చదవండి: