Suryalanka Beach: కార్తికమాసం సందర్భంగా బాపట్ల జిల్లాలోని సూర్యలంక, వాడరేవు, రామాపురం, చినగంజాం సముద్రతీరాలు పర్యటకులతో కిటకిటలాడుతున్నాయి. కార్తికమాసం పురస్కరించుకొని సూర్యలంక బీచ్‌కు పర్యటకులు పోటెత్తారు. ఆదివారం కావటం, కార్తిక మాసం సందర్భంగా సూర్యలంక బీచ్‌కు లక్ష మందికి పైగానే భక్తులు సముద్ర స్నానాలు ఆచరించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు మైకుల ద్వారా సూచనలు చేశారు. భక్తులకు ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు లేకుండా.. బాపట్ల టౌన్ సీఐ పి. కృష్ణయ్య, బాపట్ల రూరల్ సీఐ వేణుగోపాల్ రెడ్డి, మెరైన్ సీఐ సుబ్బారావు, ఆధ్వర్యంలో బందోబస్తు చేపట్టారు.
ఇవీ చదవండి: