బాపట్ల జిల్లా చీరాలలో సీపీఎం ఆధ్వర్యంలో పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పెట్రోల్ బంక్ వద్ద కరపత్రాలు పంపిణీ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై పెనుభారాన్ని మోపిందని సీపీఎం నేత బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు ఆదాయాన్ని కోల్పోయి నానా ఇబ్బందులు పడుతుంటే మోయలేని అధిక ధరల భారాన్ని మోపిందన్నారు. ఈ అధిక ధరలను నిరసిస్తూ ఈనెల 30న జిల్లాల కలెక్టరేట్ల వద్ద నిరసన ప్రదర్శనకు శ్రీకారం చుట్టామని సీపీఎం నేత బాబురావు తెలిపారు.
ఇవీ చదవండి: