ETV Bharat / state

"అందరం కష్టపడదాం.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు సాధిద్దాం"

CM MEETING WITH PARTY LEADERS : అద్దంకి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని రీతిలో విజయం సాధించాలని సీఎం అన్నారు. క్యాంపు కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన సీఎం.. అందరం కష్టపడి వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలన్నారు. 19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని, పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు.

CM MEETING WITH ADDANKI ACTIVISTS
CM MEETING WITH ADDANKI ACTIVISTS
author img

By

Published : Oct 19, 2022, 10:26 PM IST

CM MEETING WITH ADDANKI ACTIVISTS : పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే.. కుటుంబంగా వాటిని పరిష్కరించుకుని ముందుకు నడవాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి జగన్​ దిశానిర్దేశం చేశారు. అందరమూ కష్టపడి వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలని కార్యకర్తలకు సూచించారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో సీఎం సమావేశమయ్యారు. అద్దంకిలో మునుపెన్నడూలేని విజయాన్ని నమోదు చేయాలని కార్యకర్తలకు సీఎం సూచించారు. 19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని.. పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఇకపై వేసే ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలన్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ.. అందరం కలిసికట్టుగా ఉంటేనే మంచి విజయాలు సాధిస్తామన్నారు. డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశామన్న సీఎం.. అద్దంకి నియోజకవర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081కోట్లు ఇచ్చామని.. 93,124 కుటుంబాలకు మేలు చేశామన్నారు. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. 47,123 మందికి బియ్యం కార్డులు మంజూరు చేశామన్నారు.

"అందరం కష్టపడదాం.. వచ్చే ఎన్నికల్లో 175సీట్లు సాధిద్దాం"

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.