- అర్హత నిరూపించుకోకుంటే పింఛను శాశ్వతంగా రద్దు.. రాష్ట్ర ప్రభుత్వ హెచ్చరిక
అనర్హత పేరిట పింఛనుదార్లపై రాష్ట్ర ప్రభుత్వం పిడుగులు వేస్తోంది. పొంతన లేని కారణాలతో రాష్ట్రవ్యాప్తంగా లక్షా 60 వేల మందికి తాఖీదులు ఇచ్చింది. 15 రోజుల్లో అర్హత నిరూపించుకోకుంటే.. శాశ్వతంగా పింఛన్లు రద్దు చేస్తామని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దోపిడీనే లక్ష్యంగా స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వ పెద్దల గొప్పలు
వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌మీటర్లు బిగిస్తే.. రైతుల కరెంటు కష్టాలన్నీ చిటికెలో మాయమైపోతాయి. విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చేస్తాయి. ఇవీ.. స్మార్ట్ మీటర్ల గురించి సందర్భం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి, మంత్రులు కొడుతున్న గప్పాలు. కానీ స్మార్ట్ మీటర్లకు అంత సీన్ లేదని.. శ్రీకాకుళం పైలట్ ప్రాజెక్టుపై ప్రఖ్యాత ఇంధన పరిశోధన సంస్థ ప్రయాస్ ఎనర్జీ గ్రూప్-పీ.ఈ.జీ తో ఆర్థికశాఖ చేయించిన అధ్యయనంలో వెల్లడైంది. మరి స్మార్ట్ మీటర్లపై ప్రభుత్వ పెద్దలు ఎందుకు గొప్పలు చెబుతున్నారంటే.. అస్మదీయులకు ఆబగా దోచిపెట్టాలన్న తపనే అని అర్థమవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాయచోటి భూదందా కేసు.. ఏడుగురు వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు
రాయచోటిలో వైసీపీ నాయకుల భూదందాపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. 120 కోట్ల విలువచేసే 13 ఎకరాల ప్రభుత్వ భూమి క్రయవిక్రయాలు చేసిన ఏడుగురిపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. వీరిలో ఆరుగురు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి అనుచరులే. భూమిని రిజిస్ట్రేషన్ చేసిన కడప రూరల్ సబ్‌రిజిస్ట్రార్ శ్యామలాదేవిపైనా క్రిమినల్ కేసు నమోదైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అత్తాకోడళ్ల ఉరుసు తీసిన రుణ వేధింపులు
సొంతింటి కళ నెర్చుకోవాలని ఓ కుటుంబం ప్రైవేట్ సంస్థ నుంచి రుణం తీసుకోవడం వల్ల..వాళ్లు కన్న కలలన్నీ ఆవిరైపోయాయి.. ఓ నెల వాయిదా.. సమయానికి చెల్లించలేదని.. సంస్థ అధికారుల వేధింపులు ..ఆ కుటుంబంలో ఇద్దరు మహిళలు మరణానికి దారితీసాయి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కోటా కోవెలలో విశ్వాసాల గోడ.. కోరిక తీరాలంటూ విద్యార్థుల ఆశల రాతలు
రాజస్థాన్ కోటా నగరంలో శిక్షణ కోసం వచ్చినవారు కొంతకాలానికి తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఆ ఒత్తిడి నుంచి బయట పడటానికి తలవండీలోని ఓ ఆలయం ఉపశమన కేంద్రంగా మారింది. విద్యార్థుల రాతలతో ఆలయ గోడలు నిండిపోతున్నాయి.. ఇంతకీ ఆ కథేంటో తెలుసుకుందాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారత్‌లో చైనా చొరబాటు.. బంగారం కంటే విలువైన ఆ 'ఫంగస్' కోసమేనా..?
ఇటీవల భారత్ భూ భాగంలోకి చైనా అక్రమం చొరబాటుకు ప్రయత్నించింది. భారత్ సైన్యం వారిని తిప్పికొట్టింది. అయితే వారు హిమాలయ ప్రాంతంలో దొరికే బంగారం కంటే అతి విలువైన ఓ 'ఫంగస్' కోసమే ఈ ప్రయత్నం చేసినట్లు అనుమానిస్తున్నారు. అసలేంటా ఫంగస్..? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- డాలరుపై తిరుగుబాటు.. ప్రత్యామ్నాయం దిశగా ప్రపంచ దేశాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో శక్తిమంతంగా ఉన్న డాలరు ప్రభావం క్రమంగా తగ్గుతుంది. డాలరు ప్రత్యామ్నాయం కోసం అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. దీనికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బ్రష్ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అయితే జాగ్రత్త పడండి!
మనం రోజూ ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకుంటాం. అలా చేయడం వల్ల రోజంతా దంతాల్ని, నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు.. బ్రషింగ్ వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం కూడా సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ దీన్ని నిర్లక్ష్యం చేస్తే మాత్రం పళ్లు-చిగుళ్ల సమస్యలతో పాటు గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్.. వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడక తప్పదంటున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కుల్‌దీప్‌ను తప్పించడం సరైందే.. అందుకు బాధ లేదు : కేఎల్ రాహుల్
బంగ్లాతో జరిగిన మొదటి టెస్టులో కులదీప్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' సాధించినప్పటికీ.. రెండో మ్యాచ్‌లో అతణ్ని తప్పించారు. స్పిన్‌కు అనుకూలంగా ఉండే ఆ పిచ్‌పై కులదీప్‌ను ఆడించనందున తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన టీమ్ ఇండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్.. తాము సరైన నిర్ణయమే తీసుకున్నామని.. కులదీప్ విషయంలో ఎలాంటి బాధ లేదని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. మళ్లీ థియేటర్లలో 'ఖుషి' సందడి.. ట్రైలర్ రిలీజ్
Kushi Movie Re Release Date : పవర్‌స్టార్ అభిమానులకు ఇక పండగే. పవన్ కల్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'ఖుషి' ఈ డిసెంబర్ 31న థియేటర్లలో మళ్లీ విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి తాజాగా చిత్ర బృందం రీ రిలీజ్ ట్రైలర్‌ను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.