- దేశంలో కొవిడ్ నయా వేరియంట్.. కేంద్రం హైఅలర్ట్.. కొత్త కేసులు ఎన్నంటే?భారత్‌లో కొవిడ్ కొత్త వేరియంట్ బయటపడడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మాస్కు ధరించాలని సూచించింది. కాగా, బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 185 మందికి కొవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- విజయవాడ ఆసుపత్రికి సుస్తి చేసింది.. రోగులను పట్టించుకునే నాథుడు ఎక్కడ..!
VIJAYAWADA GOVT HOSPITAL: వైద్యం కోసం రోగులు ఆస్పత్రికి వస్తే.. కనీసం అంబులెన్స్‌లో నుంచి కిందికి దించి.. లోపలికి తీసుకెళ్లే పరిస్థితి లేదు. ఒకవైపు సిబ్బంది కొరత, మరోవైపు కనీసం వీల్ఛైర్లు, స్ట్రెచర్లు సైతం సరిగా లేకపోవడంతో రోగుల బంధువులే వారిని నానా ఇబ్బందులు పడి తీసుకెళ్లాల్సి వస్తోంది. కనీసం లోపలికి వెళ్లాక ఎవరిని సంప్రదించాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయంలో ఉంటున్నారు. ఇదీ ప్రస్తుతం విజయవాడలోని ప్రభుత్వ ఆస్పత్రి పరిస్థితి.
- పుట్టినరోజు సందర్బంగా సీఎం జగన్‌కు రూ 221 కోట్ల భారీ కానుక..
TDP PATTABHI ON TABS: పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్‌కు ట్యాబ్‌ల ద్వారా భారీ కానుక లభించిందని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ రాయితీతో రూ.11,999కి లభిస్తున్నా ప్రభుత్వం రూ.13,262 చెల్లించిందని ఆరోపించారు.
- "ఈట్ రైట్ క్యాంపస్" గా రామోజీ ఫిల్మ్‌సిటీ.. ధృవీకరించిన ఎఫ్ఎస్ఎస్ఏఐ
Ramoji Filmcity as Eat Right Campus: ప్రపంచంలో అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్‌సిటీకి అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వ ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ అత్యుత్తమ రేటింగ్ కింద ఫిల్మ్‌సిటీని ‘ఈట్ రైట్ క్యాంపస్’గా ధ్రువీకరించింది.
- హైవే పై 1.75 ఎకరాల భూమి.. 33 ఏళ్ల లీజు.. ఏడాదికి అద్దె రూ.1750 మాత్రమే
Anakapalli Lands: ప్రభుత్వ స్థాలాలపై అధికార వైసీపీ ప్రభుత్వం కన్నేసిందని అంటున్నారు అనకాపల్లి జిల్లా వాసులు. కొద్దిరోజులు క్రితం ఆర్టీసీ స్థలాన్ని బాపట్లలో వైసీపీ కార్యాలయానికి కట్టబెట్టారు. తాజాగా అనకాపల్లిలో ఏడాదికి 1750 రూపాయలకే 15కోట్ల విలువైన స్థలాన్ని వైసీపీ కార్యాలయానికి లీజుకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- కుక్కను ఉరేసి చంపిన మందుబాబులు.. తమను చూసి అలా చేసిందని..
మూగజీవి పట్ల అమానుషంగా ప్రవర్తించారు మందుబాబులు. తమ క్రూరత్వాన్ని శునకంపై చూపించారు. తమను చూసి కుక్క అరిచిందని ఉరివేసి హత్య చేశారు. ఈ అమానుష ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
- నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశం.. సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్ విడుదల!
ఆరోగ్య కారణాల రీత్యా అంతర్జాతీయ నేరగాడు చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది. ప్రస్తుతం నేపాల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శోభరాజ్‌పై పెండింగు కేసులు లేకపోతే విడుదలైన తర్వాత స్వదేశానికి పంపేయాలని కోర్టు సూచించింది.
- రిలయన్స్ చేతికి 'మెట్రో' వ్యాపారం.. రూ.2,850కోట్లకు డీల్
జర్మనీ సంస్థ మెట్రో ఏజీని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.2,850 కోట్లకు ఒప్పందం కుదిరినట్లు ఇరుసంస్థలు తెలిపాయి.
- భారీగా పెరిగిన IPL విలువ.. రూ.87 వేలకోట్లకు పైగా..
ఐపీఎల్ తాజాగా రూ.87 వేల కోట్ల విలువకు చేరుకుందట. డీఅండ్‌పీ అనే సంస్థ ఈ మేరకు ఐపీఎల్ విలువను లెక్కగట్టింది. కొన్ని నెలల కిందట జరిగిన వేలంలో ఐపీఎల్ మీడియా హక్కులు వచ్చే ఐదేళ్ల కాలానికి దాదాపు రూ.48 వేల కోట్లు పలికింది. దీంతో ఐపీఎల్ విలువ కూడా పెరిగి 10.9 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
- RRR ఫ్యాన్స్‌కు శుభవార్త.. ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లోకి ఎంట్రీ
ఆర్ఆర్ఆర్ అభిమానులకు శుభవార్త అందింది. ఈ చిత్రం తాజాగా ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.