ETV Bharat / state

Madanapalle: "మేం పులివెందుల వాళ్లం.. వదిలేది లేదు".. యువకుడి దారుణ హత్య - అన్నమయ్య జిల్లా తాజా వార్తలు

Murder in Madanapalle: చాలా మందికి ఎవరైనా ఎదురుచెప్తే కోపం వస్తుంది. అది తాగి ఉన్నప్పుడు అయితే వేరే లెవల్లో ఉంటుంది. దానిని పర్యవసానాలు ఒక్కోసారి మనిషి ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో వెలుగుచూసింది.

Murder in Madanapalle
Murder in Madanapalle
author img

By

Published : May 9, 2023, 10:48 AM IST

Murder in Madanapalle: ‘మేము పులివెందుల వాళ్లం.. మాతో పెట్టుకుంటే అంతే.. చూసుకుందామా.. వదిలేది లేదు’ అంటూ ముగ్గురు వ్యక్తులు ఓ యువకుడిని తరుముతూ, వెంటాడి కొట్టి చంపేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో సోమవారం ఈ దారుణ హత్యోదంతం వెలుగు చూసింది.

డీఎస్పీ కేశప్ప, రూరల్‌ సీఐ సత్యనారాయణ కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం కోటూరుకు చెందిన అక్రమ్‌ (25) అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని నక్కలదిన్నెలో ఉంటూ స్థానిక సురభి కాలనీలోని వెల్డింగ్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. అక్కడే పనిచేసే అక్రమ్‌, డ్రైవర్‌ రెడ్డిబాషా, కార్పెంటర్‌ బషీర్‌, ఖాదర్‌వల్లి, వాహనాలు శుభ్రం చేసే సుధాకర్‌, నక్కలదిన్నెకు చెందిన ఆటో డ్రైవర్‌ వీరనాగులు కలసి ఆదివారం రాత్రి సుమారు 7 గంటల సమయంలో కర్ణాటకలోని రాయల్పాడుకు మందు తాగేందుకు ఆటోలో వెళ్లారు. తిరిగి వచ్చేప్పుడు రాయల్పాడు సమీపంలో ఉన్న బంకులో ఆటోలో పెట్రోలు పోయించుకొని బిల్లు కోసం బంకు సిబ్బందితో గొడవపడ్డారు. అదే టైంలో అక్కడికి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అడ్డుగా ఉన్న ఆటోను తీయాలని కోరారు. దీంతో ఆటోలో ఉన్న అక్రమ్‌, రెడ్డిబాషా వారిని తిట్టారు. బంకు సిబ్బంది వారిని వారించి పంపే ప్రయత్నం చేశారు. అయితే తాము పులివెందుల వాళ్లమని.. వదిలే ప్రసక్తే లేదంటూ ఆ ముగ్గురూ ఆటోలో ఉన్న వారిని హెచ్చరించారు.

ఆ తరవాత పులివెందులకు చెందిన వారిగా చెప్పుకున్న ఆ ముగ్గురు వ్యక్తులు కారులో వాళ్ల ఆటోను వెంబడించి కర్ణాటక సరిహద్దుల్లోని ఉగ్రారంపల్లె వద్ద ఆటోకు అడ్డుగా నిలిపి ఆటోలో ఉన్న వారిని తీవ్రంగా కొట్టారు. అయితే ఆ క్రమంలో అక్రమ్‌ తప్పించుకున్నాడు. దీంతో అక్రమ్‌ ఎక్కడున్నాడో చెప్పాలంటూ రెడ్డిబాషాని ఆ ముగ్గురూ కలిసి సుమారు అరగంట పాటు కొట్టారు. వీరనాగులు ప్రాధేయపడటంతో వదిలేశారు. తెల్లారి అక్రమ్‌ కోసం మిగతా స్నేహితులు ఆటోలో తిరిగి గాలించినా ఆచూకి దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సోమవారం ఉదయం మదనపల్లె రూరల్‌ మర్రిమాను సమీపంలో అక్రమ్‌ మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి తల వెనుక భాగంలో బలమైన గాయం ఉండటంతో అతన్ని కొట్టి చంపినట్లు నిర్ధారించుకొని మృతదేహాన్ని పోలీసులు శవపరీక్షకు తరలించారు. ఆ ఐదుగురు తెలిపిన వివరాల మేరకు అక్రమ్‌ను పులివెందులకు చెందిన వారిగా చెప్పుకున్న ఆ ముగ్గురు వ్యక్తులే హత్య చేసినట్లు నిర్ధారించుకుని హత్య కేసును నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కారు నంబరు ఆధారంగా నిందితులు వైయస్‌ఆర్‌ జిల్లా సింహాద్రిపురానికి చెందిన వారిగా గుర్తించి ఒక బృందాన్ని అక్కడికి పంపామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.