ETV Bharat / state

రిమాండ్ ఖైదీ ఆత్మహత్య.. ఏం జరిగింది? - రిమాండ్ ఖైదీ ఆత్మహత్య

Suicide: జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసింది. ఈ మరణంపై తమకు సందేహాలు ఉన్నాయని, నిజాలు నిగ్గు తేల్చాలని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

death
death
author img

By

Published : Jul 8, 2022, 3:35 PM IST

Remand Prisoner Suicide: జైల్లో ఉన్న రిమాండ్ ఖైదీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా పీలేరు మండల కేంద్రంలోని సబ్ జైలులో చోటు చేసుకుంది. పీలేరు సబ్ జైలర్ తెలిపిన వివరాల ప్రకారం.. పీలేరు మండలం ఎర్రగుంటపల్లి పంచాయతీ ముడుపుల వేములవారిపల్లెకు చెందిన రాజేష్ నాయక్​పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఓ మైనర్​పై అత్యాచారం చేసి, గర్భవతి కావడానికి కారకుడయ్యాడని ఈ ఏడాది మార్చి 25వ తేదీన చిత్తూరు జిల్లా రొంపిచర్ల పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం రాజేష్ నాయక్​ను రిమాండ్​కు తరలించారు. అప్పటినుండి పీలేరు సబ్ జైల్లో ఉన్న రాజేష్ నాయక్ (32) ఈరోజు తెల్లవారుజామున ఉరి వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడని పోలీసులు తెలిపారు. కొన ఊపిరితో ఉన్న రాజేష్​ను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారని చెప్పారు. విషయం తెలుసుకున్న రాజేష్ కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆందోళన చేపట్టారు.

ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు
ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు

రాజేష్ మృతిపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని, పోలీసులు విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు పీలేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.