Rayachoti YSRCP Councilor Questioned on Corruption: పురపాలక సంస్థలో అవినీతి జరుగుతోందంటూ.. ఓ వైసీపీ మహిళ కౌన్సిలర్ స్థానిక ఎమ్మెల్యే ఎదుటనే కౌన్సిల్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల నియామాకల్లో నగదు వసూలు చేశారని.. అధికార పార్టీ పేరు చెప్పి భూ ఆక్రమణలకు పాల్పడుతున్నారని.. మంచినీటి సరఫరా పేరుతో కోట్ల రూపాయల బిల్లులు దండుకుంటున్నారనే అంశాలను.. కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అసలేంజరిగిందంటే.. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో పురపాలకం సంఘం కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు, స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ క్రమంలో పురపాలక పరిధిలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని.. వైసీపీకి చెందిన మహిళ కౌన్సిలర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆమె అన్నారు.
మున్సిపాలిటీలో ఆప్కాబ్ కింద 30 మంది పారిశుధ్య కార్మికులను నియామించగా.. అందులో ఒక్కొక్కరి నుంచి.. అధికారులు 50వేల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. పురపాలక శాఖ ఇన్స్పెక్టర్ పట్టణంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని.. ఎమ్మెల్యే ముందు కౌన్సిలర్ వాపోయారు. ఈ అవినీతిని మీరైనా అరికట్టండని.. ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు.
అంతేకాకుండా స్థానిక మాండవ్య నది వద్ద.. అధికార పార్టీ పేరు వాడుకుని కొందరు ఆక్రమించుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై అధికారులు ఎవరు స్పందించడం లేదని వాపోయారు. నది ఇలాగే అక్రమాలకు గురైతే.. వరదల వల్ల పట్టణం నీట మునుగుతుందని అన్నారు. భూ అక్రమాలు.. పురపాలక ఆస్తులు ఆక్రమణకు గురైతే.. పురపాలక అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Villagers Demand to Provide Basic Facilities Jagananna Colony: మా సమస్యలు తీర్చండి.. మహాప్రభో...
పురపాలక ప్రజలకు వెలిగల్లు ప్రాజెక్టు ద్వారా తాగునీరు సరఫరా అవుతోందని ఆమె వివరించారు. అయినప్పటికీ ట్యాంకర్లతో మంచినీరు సరఫరా చేస్తున్నట్లు చెప్పి.. అధికారులు ఏడాదికి రెండు కోట్ల రూపాయల బిల్లులు డ్రా చేసుకున్నారని ఆమె అన్నారు. ఈ నీళ్లు ఎక్కడ సరఫరా చేశారో అధికారులు తెలపాలని ఆమె ప్రశ్నించారు. ఈ సమస్యలపై వెంటనే ఎమ్మెల్యే స్పందించాలని ఆమె కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే: రాయచోటిలో నెలకొన్న అవినీతి, అక్రమాలలో కొన్ని తన దృష్టికి వచ్చినట్లు.. కౌన్సిలర్ ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానంగా చెప్పారు. అంతేకాకుండా వాటిపై అధికారులతో చర్చించి.. తగిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ సమయంలోనే కొందరు కౌన్సిలర్లు స్పందిస్తూ.. పట్టణంలోని పలు వార్డుల్లో చేపట్టిన పనులకు బిల్లులు ఇంకా అందడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా అధికారులకు కూడా తమ సమస్యలను వివరించారు.
TDP leaders Bus yatra: వైసీపీ అనకొండల అడ్డగోలు తవ్వకాలు.. రూపురేఖలు కోల్పోయిన మరో కొండ